ఐరన్ లోపం కారణంగా రక్తహీనతతో పాటు అనేక ఇతర సమస్యలు తలెత్తుతాయి. మనం రోజు తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే మన శరీరానికి అవసరమైన ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. శిశువుకు ఆరునెలల వయసు వచ్చే వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఆరునెలల నుంచి తల్లిపాలతో పాటు ఇంట్లోనే తయారుచేసిన కాంప్లిమెంటరీ ఫుడ్ ఇవ్వాలి. ఒక్కోక్కటి మెల్ల మెల్లగా అలవాటు చేయాలి. లేకపోతే అతిసారానికి గురయ్యే ప్రమాదం ఉంది. సాధారణంగా బయట దొరికే కాంప్లిమెంటరీ ఆహారంలో ఇనుము తగినంత ఉండదు.  కాబట్టి వండిన ఆహారాన్ని మెత్తని పేస్టులాగా తయారుచేసి ఇస్తే మంచిది. అన్నం, పప్పు ఆకుకూరలు బాగా ఉడికించి, మెత్తగా, మృదవుగా తయారుచేసి తినిపించాలి. మసాలాలు, కారం ఎక్కవగా ఉండకూడదు. అన్నం, పప్పు, కూరగాయాలు ముఖ్యంగా ఆకుకూరలు, కొత్తిమీర, టమాటా, క్యారెట్టు ఎక్కువగా ఇస్తే ఇనుము లోపం తలెత్తే అవకాశం ఉండదు. గుజ్జుల వంటి చిరుధాన్యాలను రోస్టు చేసి, పొడిగా తయారుచేసి, మెత్తని పేస్టు రూపంలో ఇస్తే ఇనుము లోపం తలెత్తే అవకాశమే ఉండదు. సజ్టల వంటి చిరుధాన్యాలను మొదట రోస్ట్ చేసి, పొడిగా తయారుచేసి, మెత్తని పేస్టు రూపంలో ఇస్తే సులభంగా జీర్ణం చేసుకోగలుగుతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: