శరీరానికి సరిపడినంత ఆహారం తీసుకోవడం తప్పనిసరి. అందంగా, సన్నగా నాజూగ్గా ఉండాలనే ఉద్దేశంతో చాలామంది మహిళలు డైటింగ్ చేస్తుంటారు. డైటింగ్ చేయడం వల్ల సన్నబడరు. డైటింగ్ చేసేవారు శరీరంలో ఉండే మేలుచేసే కొలెస్టరాల్, గుండెను రక్షించే ప్రొటీన్లు తగ్గిపోతాయి. తత్ఫలితంగా గుండెను ఒత్తిడి పెరిగి సమస్యలు వచ్చే అవకాశముంది. అందుకే కడుపుకు పట్టినంత తిని ఒంటికి పట్టినంత పని చేయాలని అనేవారు పెద్దవారు. డైటింగ్ చేయడం అనువసరమని హాయిగా అన్ని ఆహారపధార్థాలను తినమని వైద్యులు సలహాలిస్తున్నారు. శరీరానికి కావాలసినంత వ్యాయామం వుంటే ఏ విధమైన డైటింగ్ చేయకుండానే అందంగా, నాజూగ్గా తయారవ్వచ్చు.. ఇంటి పనంతా తమ చేతులమీదుగా చేసుకొనే ఎటువంటి డైటింగ్ అవసరలేదు. అనారోగ్యాలు దరిచేరవు. టీనేజ్ అమ్మాయిలు కడుపునిండా తినడానికి ఇబ్బంది పడుతుంటారు. అలా అయితే ఎనిమిక్ గా తయారువడమే కాకుండా మొహంలో మెరుపు, కళ్లలో కాంతి తగ్గిపోతాయి. శరీరానికి శక్తినిచ్చే క్యాలరీలను తీసుకోకుండా తగ్గించి తినడంవల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. కొవ్వుపధార్థాలు, తీపి పధార్థాలు, ఎక్కవగా తినకుండా ఉంటే మంచిది కొన్నిరోజులు డైటింగ్ పేరుతో కడుపు మాడ్చుకుని, ఆ తర్వాత మామూలుగా తినడం మొదలుపెడితే జీర్ణకోవాశానికి మంచిదికాదు.  ఒళ్లు రావడం అనేది ఆయా వ్యక్తుల శరీర తత్వాన్ని, హార్మోన్స్ ను బట్టి ఉంటుంది. కానీ ఆహారం వల్ల కాదని వైద్యులు చెబుతున్నారు. అందుకే డైటింగ్ చేయడం అంత అవసరంకాదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: