బాంబినో కార్డ్ బాత్ తయారికి వాడే పధార్థాలు :
వర్మిసెల్లి : 100 గ్రాములు
పెరుగు : 150 గ్రాములు
పచ్చిశనగ పప్పు : 1 చెంచా
పోపు సామానుల : 1 చెంచా
ఎండుమిర్చి : 6
పచ్చిమిర్చి : 1చెంచా ముక్కలు
కరివేపాకు : 1 రెమ్మ
అల్లం సననని ముక్కలు : 1 చెంచా
ఉప్పు : సరిపడ
నూనె : 3 చెంచాలు

తయారీ చేయువిధానం :
ముందుగా ఒక వంతు వర్మిసెల్లికి 3 వంతుల నీరు పోసి ఉడికించాలి. పదునుగా ఉడికించి వార్వాలి. బాండీపెట్టి నూనె వేసి పచ్చిశనగపప్పు, పోపుసామాను మిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు, ఎండుమిర్చి ముక్కలు, ఇంగువ వేసి వేపాలి.
పెరుగు బౌల్ లో వేసి సరిపడ ఉప్పు వేయాలి. తరువాత పెరుగులో ఉడికించిన సేమ్యా జత చేయాలి. అంతా కలిసేలా చేయాలి. వీటికి ఆరిన తాలింపు జతచేసి ప్లేట్లలో సర్వ్ చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: