కావలసిన పదార్దములు :

గుడ్లు : 2

కారం : రెండు స్పూన్లు 

మిరియాల పొడి : ఒక స్పూను 

గోధుమ పిండి : 150 గ్రాములు 

నెయ్యి: 100 గ్రాములు 

ఉప్పు: సరిపడా 

 తయారుచేయు విధానం :

గోధుమ పిండిని నీళ్ళు పోసి కలపండి.  ఎగ్ ని ఉడక పెట్టి, చందమామ [ఎల్లో] తీసివేసి, సన్నటి ముక్కలుగా తరగండి, వీటిలో ఉప్పు, కారం, మిరియాలపొడి వేసి మంచిగా మిక్స్ చెయ్యండి.  కొంచెం పిండి తీసుకుని, సాది దానిలో ఎగ్ మిశ్రమం పెట్టి, పిండితో మూసివేసి... తిరిగి నెమ్మదిగా సాదుకొని, రౌండ్ చపాతీలా తయారు చేసుకోవాలి. 

ఒకొక్క పరోటాను పెనం పై వేసి,  గుడ్డు సొనను దానిపై పొయ్యండి. ఉప్పు, మిరియాల పొడి, కారం పరోటాల పైన చల్లాలి. అట్లకాడతో చుట్టూ నెయ్యి అంటించండి. పరోటా కాలగానే మరోవైపు తిప్పి కాల్చండి. రెండువైపులా బాగా కాలేదాకా ఉంచి దింపెయ్యాలి. నోరూరుంచే ఎగ్ పరోట రెడీ 

మరింత సమాచారం తెలుసుకోండి: