నేడు వాషింగ్  మిషన్లు రాకతో గృహిణుల పని చాలా తేలికైంది.  ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో ఉండే మహిళలు నిమిషాల వ్యవధిలో ఇంటెడు బట్టల్ని ఉతికే సౌకర్యం ఏర్పడింది.  కానీ వాషింగ్ మిషన్ ను ఎంత జాగ్రత్తగా వాడుకుంటే, చూసుకుంటే అంత మన్నిక.

-      వాషింగ్ మిషన్ కు సరఫరా అయ్యే విద్యుత్ కు ఎర్తింగ్ సరిగా లేకపోతే షాక్ కొట్టే ప్రమాదం ఉంది.

-      ఉతికే యంత్రంలో 50 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ వేడి ఉన్న నీటిని పోయవద్దు

-      మట్టి, నూనె, ఆయిల్ మరకలంటిన దుస్తులను శుభ్రపర్చడానికి మాత్రమే గోరువెచ్చని నీటిని వినియోగించాలి.

-      కంట్రోల్ స్విచ్ లపై నీరు పడనీయొద్దు.

-      కిరోసిన్, ఆయిల్, రసాయనాల్లో తడిసిన దుస్తులను వాషింగ్ మిషన్లో శుభ్రం చేయకూడదు.  ఒకవేళ తప్పదనుకుంటే అవి ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.

-      వాషింగ్ మిషన్లో బట్టలు, నీరు ఉండగా అటూ ఇటూ జరపొద్దు.

-      వాషింగ్ మిషన్లో ఎక్కువ భాగం ప్లాస్టిక్ తో తయారయ్యే మెటీరియల్ కాబట్టి వేడి, మంటలు దగ్గరకు రానియ్యొద్దు. ఎండలో పెట్టవద్దు.

-      బట్టలను ఒకేసారి కుక్కకుండా ఒక్కో గుడ్డను లోపల పేర్చాలి.

-      వాషింగ్ మిషన్ సామర్థ్యంతో 70-80 శాతం వరకే గుడ్డలను వేస్తే బాగా ఉతుకుతుంది.

-      ఉతకడానికి శుభ్రమైన నీటిని ఉపయోగించాలి.

-      స్పిన్ డ్రయ్యర్ ను ఐదు నిమిషాలకు మించి పని చేయించకూడదు. తప్పదనుకుంటే అరగంట విరామం తర్వాత మళ్లీ పనిచేయించకుడదు.

-      ఉన్ని దుస్తులను స్పిన్ డ్రై చేయొద్దు.

-      వాషింగ్ మెషిన్ నేలపై సరిగా అమరకపోతే ఉపయోగించేటపుడు శబ్దం వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: