వేసవి కాలంలో ఎండలు మండుతుంటాయి..దాహం తీర్చుకోవడానికి రక రకాల పానియాలను ఆశ్రయిస్తుంటారు జనాలు.  ముఖ్యంగా వేసవిలో చల్లదనం కావాలంటే ఎక్కువగా వాటర్ మిలన్ తీసుకుంటే మంచిది.   దీంతో టేస్టు తో పాటు మంచి ఆరోగ్యం కూడా మనం కాపాడుకున్నవాళ్లమవుతాం.  వాటర్ మిలన్ తో ఎన్నో రకాల జ్యూస్ చేసుకోవొచ్చు. 


కావల్సినవి : గింజల్లేని పుచ్చకాయ ముక్కలు : ఎనిమిది కప్పులు కీరదోస : ఒకటి(గింజలు లేకుండా) ఎర్రక్యాప్సికం: సగం ( ముక్కలు తరగాలి) తాజా బేసిల్ ఆకులు : పావుకప్పు వెనిగర్ : మూడు టేబుల్ స్పూన్లు సాంబారుకు వాడే చిన్న ఉల్లిపాయలు తరుగు : రెండు టేబుల్ స్పూన్లు ఎక్సట్రా వర్జిన్ ఆలివ్ నూనె : రెండు టేబుల్ స్పూన్లు కల్లుప్పు : ముప్పావు చెంచా ఆవోకాడో : సగం (తరగాలి)


తయారీ చేసేవిధానం : పుచ్చకాయముక్కలు, కీరదోస, క్యాప్సికమ్, బాసిల్, వెనిగర్, ఉల్లిపాయముక్కలు, నూనె, ఉప్పును ఓ పాత్రలోకి తీసుకుని అన్నంటినీ బాగా కలపాలి. అందులో ముప్పావు వంతు మిశ్రమాన్ని తీసుకుని మిక్సీలో వేసి మెత్తని గుజ్జులా చేసుకోవాలి. వీటన్నింటిని మిగిలిన బాగానికి కలిపి ప్రిజ్ లో ఉంచాలి. చల్లగా ఆయ్యాక ఆవోకాడో ముక్కలు అలంకరించి వడ్డించడమే ఆలస్యం.

మరింత సమాచారం తెలుసుకోండి: