కావాలసిన పధార్థాలు : బోన్ లెఃస్ మటన్ 400 గ్రాములు లేమన్ గ్రాస్ : 400 గ్రాములు కర్రీ పౌడర్ : 150 గ్రాములు కొబ్బరిపాలు : 200 గ్రాములు ఉప్పు : రుచికి తగినంత పంచదార : 20 మి.లీ. కబాబ్ లు చేయడానికి వెదరు ఈనెలు లేదా సన్నని స్టీల్ ఊసలు -5 


తయారుచేసే విధానం : లేమన్ గ్రాస్ తరిగి జ్యూస్ లా తయారుచేసుకొని అందులో కొబ్బరిపాలు, కర్రీ, పౌడర్, ఉప్పు, పంచదారను వేసి బాగా కలిపి పక్కనుంచుకోవాలి.


మటన్/చికెన్ ను 4 అంగుళాల పొడుగు ముక్కగా కట్ చేసుకొని, వాటిని శుభ్రమైన గుడ్డతో తుడవాలి, వీటిని లేమన్ గ్రాస్ మిశ్రమంలో వేసి ఒక రాత్రంతా ప్రీజర్ లో పెట్టాలి. తర్వాత ముక్కల్ని ఊసలకు కబాబ్ లాల గుచ్చి నిప్పుల మీదకాని, గ్రిల్ స్టౌవ్ పైన కానీ దోరగా కాల్చుకోవాలి. ఈ కబాబ్ లను వేరుశనగ పచ్చడితో తింటే బాగుంటాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: