హైదరాబాద్ ఫిలిం నగర్ లోని ఆర్జీయే స్టూడియో లో మరణించిన బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య విషయం రోజుకొక మలుపు తిరిగుతోంది. ఈ కేసులో ఆమెని ఎవరో చంపారు అనే అనుమానాలు తమకి లేవు అనీ అది ముమ్మాటికీ ఆత్మహత్యే అనడానికి సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయి అనీ పోలీసులు నిర్ధారణ కి వచ్చారు.


అలాగే ఎస్సైగా పని చేసిన ప్రభాకర్ రెడ్డి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు అనీ శిరీష మీద అఘాయిత్యానికి ప్రయత్నం చెయ్యడం ఆ టైం లో ఆమె గొడవ చెయ్యడం ఆమె ఇంటికి వెళ్ళగానే సూసైడ్ చేసుకోవడం ఇవన్నీ తెలుసుకున్న ప్రభాకర్ రెడ్డి తన పరువు పోతుంది అనే భయం తో తన క్వార్టర్స్ లోనే ఆత్మహత్య చేసుకున్నాడు అని నిర్ధారించారు పోలీసులు.


కాగా శిరీష తండ్రి పోలీసుల సాక్ష్యాలు అన్నీ అబద్ధాలు అనీ తమ కూతురు మీద వ్యభిచారి అనే ముద్ర వేస్తున్నారు అనీ ఆరోపిస్తున్నారు. తమ కూతురు విషయం లో న్యాయం కోసం మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తాం అంటున్నారు ఆయన.. తేజస్విని కూడా ఈ కేసులో భాగం అయినా ఆమెని గురించి కానీ ఆమె విషయాలు కానీ మీడియా కంట పడకుండా ఎలా చూస్తున్నారు అంటూ ఆయన ప్రశ్నించారు. 


కేసు పెట్టింది ఆమె అని, ఆమె పాత్ర ఏంటో వివరాలు బయటకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, ఈ కేసులో పోలీసులు ఏ1గా శ్రావణ్‌ ను, ఏ2 గా రాజీవ్‌ ను చేర్చడం కూడా ఆసక్తికరంగా మారింది. ఈ కేసులో అన్నింటా ముందు ఉన్నాడు రాజీవ్ , అతనే ఆమెని కొట్టాడు ఆమెతో ఎన్నో ఏళ్ళుగా సహజీవనం చేస్తూ ఆమెతో శారీరిక సంబంధం పెట్టుకున్న వ్యక్తి అతను. అయితే అర్ధం లేకుండా అతనితో పాటు ఉన్న శ్రవణ్ ని ఏ 1 గా చూపిస్తూ రాజీవి ని ఏ 2 చేసారు పోలీసులు.


మరింత సమాచారం తెలుసుకోండి: