బెండకాయ పల్లీకూర కావలసిన పదార్థాలు: బెండకాయలు : అర కిలో పల్లీలు : గరిటెడు కారప్పొడి : రెండు చెంచెలు పెరుగు : అర కప్పు పసుపు : చిటికెడు ఉల్లిగడ్డ తరుగు : అర కప్పు అల్లం, వెల్లుల్లి : చెంచెడు నూనె : సరిపడా ఉప్పు : రుచికి తగినంత తయారు చేసే పద్ధతి: మందపాటి తవ్వలో (గిన్నె) బెండకాయ ముక్కలు వేసి అందులో పెరుగు, కొంచెం ఉప్పు వేసి సన్నని సెగమీద మూతపెట్టి మగ్గనివ్వాలి.


తర్వాత మూకుడులో నూనె వేసి కాగాక దాంట్లో ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వేసి కలుపుకుని అందులో బెండకాయ ముక్కలు వేసి వేయించాలి. కారప్పొడి, ఉప్పు చల్లుకోవాలి. పల్లీలను వేయించి పొడిచేసి ఇందులో వేసుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకుని దించితే సరి, రుచికరమైన

మరింత సమాచారం తెలుసుకోండి: