ఒక ప్రైవేటు ఆసుపత్రి లో ఆమె నర్స్ గా పని చేస్తోంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో ఉన్న ఆ ఆసుపత్రి లో ఇరవై నాలుగు సంవత్సరాల యువతి నర్స్ గా పని చేస్తోంది. ఆమె తమ్ముడి ఫ్రెండ్ లోక్ నాథ్ అనే వ్యక్తి ఆమెకి పరిచయం చేసుకుని సినిమాల్లో ఛాన్స్ లు ఇప్పిస్తా అంటూ ఆమెని అతని తల్లి విజయలక్షి దగ్గర కి తీసుకుని వెళ్ళాడు లోక్ నాథ్. విజయలక్ష్మి సహాయం తో ఒక పెద్ద సినిమాలో చిన్న పాత్ర ఇచ్చి మూడు వేలు ఇప్పించారు.


ఆ దెబ్బతో ఆ యువతికి విజయలక్ష్మి మీద నమ్మకం ఏర్పడింది. ఈ క్రమం లో ఒక షార్ట్ ఫిలిం లో నటించడం కోసం కూడా ఆ యువతి ఓకే చెప్పి తెల్ల కాగితం మీద సంతకం పెట్టమని కోరగా పెట్టింది. కొద్ది రోజుల తరవాత యూనిట్ సభ్యులు అందరూ ఆమెని ఒక గుర్హ్టు తెలియని ప్రదేశానికి తీసుకుని వెళ్లి ఆమె మీద అఘాయిత్యం చేస్తూ అదే వీడియో గా తీసారు.


అక్కడ నుంచి విజయలక్ష్మి కి ఫోన్ చేసి విషయం చెప్పింది బాధితురాలు.  ‘వాళ్లు ఎలా చెబితే అలా చెయి. లేకపోతే, వేరే కేసులో ఇరికిస్తాను’ అంటూ విజయలక్ష్మి బెదిరించింది.


గత్యంతరం లేని పరిస్థితుల్లో యూనిట్ సభ్యులు చిత్రీకరించిన పది అశ్లీల షార్ట్ ఫిల్మ్స్ లో ఆ యువతి నటించాల్సి వచ్చింది. ఆన్ లైన్ లో ఆ షార్ట్ ఫిలిం పెట్టగా ఆమె ఆసుపత్రి వారితో పాటు అందరూ ఆమెని గుర్తు పట్టడం మొదలు పెట్టారు. ఆమె ఉద్యోగం కూడా పోయింది. దీంతో పోలీసుల దగ్గరకి వెళ్ళింది ఈ కేసు. 

మరింత సమాచారం తెలుసుకోండి: