పిల్లల కోసం జీవితాలని త్యాగం చేస్తూ బతికే ప్రతీ తల్లీ తండ్రి కీ రేమాండ్ వ్యవస్థాపకుడు విజయ్ పద్ సింఘానియా సలహా ఇచ్చారు . తన కొడుకు గౌతం ని కూడా తాను అందరు తల్లి తండ్రుల లాగానే ప్రేమించాను అనీ కానీ చివరికి తనకి మింగ మెతుకు కూడా లేకుండా తన కొడుకు తనని రోడ్డున పడేసాడు అని వాపోయారు ఆయన.


వెయ్యి కోట్ల విలువ అయిన తన వాటా మొత్తం అతని పేరున ఉండగా ఇప్పుడు తాను ముంబై లో ఒక అద్దె ఇంట్లో బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెబుతున్నారు విజయ్.  "మీ పిల్లలను ప్రేమించండి. వారి ఆలనా పాలనా చూడండి.


అయితే, గుడ్డిగా మాత్రం నమ్మవద్దు" అంటున్నారు." నా వయసు డబ్భై తొమ్మిది సంవత్సరాలు. ఈ వయసులో కుటుంబ విభేదాల కోసం కోర్టుకు వెళతాను అని నేనెప్పుడూ అనుకోలేదు.


నా దగ్గర ఉన్న ప్రతీ రూపాయి పోగేసి నా కొడుకుకి ఇచ్చి ఈ రోజు రోడ్డున పడ్డాను. " అన్నారు ఆయన. తన పోషణ నిమిత్తం నెలకు రూ. 7 లక్షలు ఇవ్వాలని విజయ్ పథ్ సింఘానియా కుమారుడిపై న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: