ఆదిలాబాద్ జిల్లాలో లేడీ స్టూడెంట్స్ ఆత్మహత్య ప్రయత్నాలు  తెలంగాణా రాష్ట్రం లో సంచలనం రేపాయి. ఇద్దరు విద్యార్ధినులు బాలికల వసతి గృహం లోనే యాసిడ్ తాగి చనిపోవడానికి ప్రయత్నం చేసారు.


లక్సెట్టి పేట లేడీస్ హాస్టల్ లో ఈ మధ్యకాలం లో స్టూడెంట్ ల మధ్యన ర్యాగింగ్ గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి .. గత రాత్రి సీనియర్ అమ్మాయిలు జూనియర్ అమ్మాయిలు అందరినీ పిలిచి బట్టలు ఇప్పి ర్యాగింగ్ చేసారు అని తెలుస్తోంది.


కొందరు సీనియర్ లు వీడియో కూడా తీయడం తో ఈ వీడియో ఎక్కడ వైరల్ అవుతుందో అనే భయం తో ఇద్దరు అమ్మాయిలు బాత్ రూమ్ క్లీన్ చేసే యాసిడ్ ని గడగడా తాగేసి సూసైడ్ కి ప్రయత్నం చేసారు.


 ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వారు కోలుకునేందుకు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు.  ఈ వీడియో పోలీసుల దగ్గర ఉందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: