చికెన్ కాజు కుర్మా కావాలసిన పధార్థాలు : చికెన్ : 1 కేజీ,  ఉల్లిపాయలు : 4,  పచ్చిమిర్చి : 8,  కరివేపాకు : రెండు రెమ్మలు,   కాజు : అర కప్పు  కొత్తిమీర : 1 కప్పు నూనె : తగినంత ఉప్పు : రుచికి సరిపడా  కారం : తగినంత పసుపు : అర టీ స్పూన్ అలంవెల్లుల్లి పేస్టు : 4 టీ స్పూన్లు జీలకర్ర : 2 టీ స్పూన్లు ధనియాల పొడి : 2 టీ స్పూన్లు  గసగసాలు : 2 టీ స్పూన్లు తయారీ చేయువిధానం : ముందుగా చికెన్ లో కొంచెం ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలిపి ఒక అరగంట ప్రిజ్ లో ఉంచాలి.


మసాలా ధినుసులు అన్ని మెత్తగా పొడి చేసుకోవాలి. పది జీడిపప్పులును కూడా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో నూనె వేసి మిగిలిన కాజూ వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే నేనెలో తరిగిన కొత్తిమీర, మిర్చి, తగినంత కారం వేసి దోరగా వేగాక సన్నగా కొత్తిమీర, మిర్చి, తగినంత కారం వేసి దోరగా వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయులు వేసి వేయించాలి.


అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేవరకు వేయించి మసాలా పొడి, పసుపు కూడా వేసి బాగా కలిపి రెండు నిమిషాలు వేయించాలి.  తర్వాత అందులో ముందుగా నాన్నబెట్టుకొన్న చికెన్ వేసి బాగా కలిపి తక్కువ మంటలో అయిదు నిమిషాలు ఉడికించినంత ఉప్పు ఒక కప్పునీళ్లు కలిపి మూతపెట్టి ఉడికించాలి.

చికెన్ ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత కాజూపొడి, వేయించిన కాజు కలిపి కూర బాగా దగ్గరయ్యే వరకు ఉడికించి చెయ్యాలి. అంతే ఒక బౌల్ లోనికి తీసుకుని కొంచెం కొత్తిమీర తురుమును గార్నిష్ గా అలంకరించుకుంటే సరి చికెన్ కాజు కుర్మా రెడీ..  

మరింత సమాచారం తెలుసుకోండి: