రెయిన్‌బో చపాతీ కావలసిన పదార్థాలు: గోధుమపిండి – 15 గ్రా,  సోయాపిండి – 10 గ్రా, రాగిపిండి – 5 గ్రా, శెనగపిండి – 5 గ్రా, అవిసలు – 2 గ్రా, పాలకూర – 25 గ్రా, క్యారెట్ తురుము – ఒక టేబుల్ స్పూను, పచ్చిమిరపకాయ -ఒకటి, కొత్తిమీర – ఒక కట్ట, గరంమసాల – చిటికెడు, ఉప్పు – తగినంత, నూనె – రెండు టీ స్పూన్లు.  

మొలకెత్తిన గింజలు – రెండు టేబుల్ స్పూన్లు, పెరుగు. తయారుచేయు విధానం:  ఒక గిన్నెలోకి గోధుమపిండి, సోయాపిండి, రాగిపిండి, శెనగపిండి, అవిసలు, పాలకూర తురుము, క్యారెట్ తురుము, గరం మసాలా, ఉప్పు, నూనె వేసి కొద్దిగా నీళ్లు పోసి చపాతిపిండిలా కలుపుకోవాలి.  

ఒక అరగంట నానిన తర్వాత చపాతీలు ఒత్తుకుని పెనంపై కాల్చుకోవాలి. పెరుగులో మొలకెత్తిన గింజలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. అన్ని రకాల పిండితో చేసిన ఈ రెయిన్‌బో చపాతీలను పెరుగులో నంజుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: