ఆయన విజయవాడ అయ్యప్పనగర్ లో ఒక ప్రముఖ వైద్యుడు పేరు కృష్ణమూర్తి. రెండు నెలల కిందట ఫేస్ బుక్ లో లండన్ లో ఉంటున్న ఒక మహిళ పరిచయం అయ్యింది.


ఇద్దరి మధ్యనా క్లోజ్ గా చాటింగ్ వ్యవహారం నడిచింది. ఈ నెల 15 న డిల్లీ వచ్చా అంటూ చెప్పిన ఆమె విజయవాడ కి విమానం టిక్కెట్ కొనాలి అంటే ఇండియన్ కరన్సీ కావాలని అడుగుతున్నారు అనీ తనదగ్గర ఇరవై వేల పౌండ్ లు ఉన్నాయి కానీ మార్చుకోవడం తెలీదు అంటూ ఫోన్ చేసి భాదపడింది.


మరొక వ్యక్తి తో ఫోన్ చేయించి విదేశీ కరన్సీ తో ఒక మహిళ ఇక్కడ ఏడుస్తోంది ఆమె మీ తాలూకా ఏనా అంటూ ఫోన్ చేయించింది. తనకు ఇండియన్ కరెన్సీ కావాలని ఆమె వేడుకోవడంతో కృష్ణమూర్తి ఆమె చెప్పిన ఖాతాకు డబ్బు పంపాడు. తనకు మరుసటి రోజుకు విమానం టికెట్ దొరికిందని చెప్పి, ఖర్చులకంటూ ఇంకాస్త డబ్బు అడిగింది.


మొత్తం రూ. 4.88 లక్షలు ఆమె ఖాతాలో వేశాడు. ఆ తరవాత రోజు నుంచీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది ఆమె. దాంతో అతను మోసపోయాను అనే విషయం చాలా ఆలస్యంగా తెలుసుకున్నాడు. డాక్టర్ లాంటి ఉన్నత చదువు చదువుకుని కూడా విదేశీ కరన్సీ తో ఫ్లైట్ టికెట్లు కొనచ్చు అనే విషయం తెలుసుకోలేకపోయిన అతను ఇప్పుడు పటమట పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: