కావలసిన పధార్థాలు : బీరకాయలు : అర కిలో కారం : 1 చెంచా నూనె : ¼ కప్పు తాలింపు గింజలు : 4 చెంచాలు కరివేపాకు : 10 రెబ్బలు పసుపు, ఉప్పు : తగినంత ఉల్లిపాయలు : ¼ కిలో ఎండుకొబ్బరి తురుము : 1కప్పు జీలకర్ర : 2 చెంచాలు ఎండుమిర్చి : 2 అల్లం : చిన్నముక్క చింతపండుగుజ్జు : 1 చెంచా తయారీ చేయువిధానం : ఉల్లిపాయలు సన్నగా తరగాలి. అల్లం, జీలకర్ర, కారం , ఉప్పు, ఉల్లిముక్కలు, కలపి దంచాలి.


చివరలో కొబ్బరి తురుము వేసి తీయాలి. మిక్సీలో అయితే మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా తీయాలి. ఇష్టమయిన వారు వెల్లుల్లి 10 రెబ్బులు కూడా వేసి దంచి మసాలా తయారుచేయాలి. బీరకాయ తొక్కుతీసి కాయను నాలుగు పక్షాలుగా గుత్తిలాగా చేసి దాంట్లో ఈ మసాలాను కూరాలి.


బాండీలో నూనె వేడి చేసి తాలింపు వేసి గుత్తి బీరకాయలను వేసి పసుపు కూడా వేసి మూత బదులు డిష్ లాంటిది పెట్టి దాంట్లో నీరు పోసి సన్నని మంట మీద మగ్గనివ్వాలి. చింతపండు గుజ్జు జత చేయాలి మద్య మధ్య కూరని కదిలిస్తూ ఉండాలి. నీరు ఇగిరి నూనె పైకి తేరిన తరువాత దించి వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేయాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: