మనం ఎంతో ఇష్టంగా తినే పలావు రక రకాలుగా చేసుకుంటారు.  అయితే మాంసాహారులు ఎన్నో వెరైటీల్లో పలావు చేస్తుంటారు. ఇక శాకాహారుల కోసం కూడా కొన్ని రకాల పలావులు తయారు చేస్తున్నారు.  కొబ్బరి పలావు ఎలా చేస్తారో చూద్దామా..!


తయారీలో వాడే పధార్థాలు : కొబ్బరి తురుము : 2 కప్పులు  జీడిపప్పు : అర కప్పు ఛాయమినపప్పు : 1 చెంచా దాల్చినచెక్క : 4 చిన్నముక్కలు ఎండుమిర్చి : 7 లవంగాలు : 8 నెయ్యి : అర కప్పు ఉప్పు : రుచికి సరిపడ తయారీ ఎలా : ముందుగా బాస్మతీ బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంట సేపు నీటిలో నానపెట్టాలి. ఫ్రెషర్ ఫ్యాన్ లో కొంచెం నెయ్య జీడిపప్పు , కిస్ మిస్ వేసి వేపాలి. వాటిని తీసి ప్రక్కన పెట్టి వుంచాలి. మిగిలిన నెయ్యి కూడా వేసి ఛాయమినపప్పు, ఆవాలు, కరివేపాకు, లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క, ఎండుమిర్చి వేసి వేపాలి.


తరువాత కొబ్బరి తురుము, కూడా వేసి కలుపుతూ వేపుకోవాలి. తరువాత నీటిని వార్చి బియ్యాన్ని కూడా వేసి కలుపుతూ వేపుకోవాలి. ఈ లోపల పాలను కాగపెట్టి ఉంచాలి. కొద్దినిమిషాలు వేపిన తరువాత పాలు, సరిపడ ఉప్పువేసి ఉడికించించాలి. ఉడికి బుడగలు వస్తున్నప్పుడు మంట తగ్గించి కలుపుతూ ఉడికించాలి. అన్నం ఉడికిన తర్వాత మూద పెట్టి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి. తరువాత తీసి సర్వింగ్ ప్లేట్లలలో పెట్టి పైన వేపిన జీడిపప్పు, కిస్ మిస్లను చల్లి వేడి వేడిగా ఉల్లిరైతాతో సర్వ్ చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: