ఉప్మా అంటే చిన్నల నుంచి పెద్దలవరకు ఇష్టపడి తినేది ఉప్మా అందులో ఎగ్ ఉప్మా అంటే చాలా చాలా ఇష్టంగా తింటారు. కావాలిసిన వస్తువులు : ఉడికించిన గుడ్లు : నాలుగు బొంబాయిరవ్వ : పావు కేజి (గోదుమ రవ్వ కూడా వాడవచ్చు) ఆవాలు : అయిదు గ్రాములు జీలకర్ర : అయిదు గ్రా.. ఉప్పు : సరిపడా కరివేపాకు : వాసన కోసం నెయ్యి : 50 గ్రాములు ఉల్లిపాయ : ఒకటి పాలు : తగినన్ని పచ్చిమిర్చి : మూడు  కొత్తిమీర : సరిపడా ఎగ్ ఉప్మా

తయారీ చేయు విధానం : బాణలీలలో బొంబాయి రవ్వ వేయించాలి (నూనె అవసరం లేదు) ఒక పాత్రలో యాభై గ్రాములు నియ్యివేసి, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి తిప్పుతూ వుండాలి. ఇవన్నీ బాగా వేగిన తరువాత కరివేపాకు దూసి వేయాలి. చాలామంది ఈ సమయంలో నీళ్లు పోస్తారు. కానీ ఇక్కడ పాలు పోయాలి.

మరుగుతూ పెళపెళలాడుతూ వుండగా గుడ్లను ముక్కలుగా కోసి అందులో వేయాలి. కొంచెం సేపు మరిగిన తర్వాత బొంబాయి రవ్వ వేస్తూ కలుపుతూ ఉండాలి. బాగా మగ్గిన తరువాత కొత్తిమీర వేసి దింపెస్తే బ్రహ్మాండంగా ఉంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: