మెంతి క్యాప్సికమ్ రైస్ కావాలసిన పధార్థాలు :  బియ్యం : 2 కప్ లు  మెంతికూర : 1 కట్ట క్యాప్సికమ్ : 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు : 2 టమోటొ : 2  పచ్చిమిర్చి : 4-6 అల్లం, వెల్లుల్లి పేస్టు : 2 టీ స్పూన్లు  చెక్క : చిన్న ముక్క  లవంగాలు : 3 కారం : 1 స్పూన్  ధనియాల పొడి : 1 స్పూన్  పసుపు : చిటికెడు ఉప్పు : రుచికి తగినంత నూనె : కావాలసినంత

తయారు చేయువిధానం : ముందుగా ప్రెజర్ కుక్కర్ లో నూనె వేసి వేడిచేయాలి. నూనె వేడయ్యాక అందులో చెక్క, లవంగాటు, యాలకులు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. తర్వాత అందులో ఉల్లిపయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకూ వేయించుకోవాలి. తర్వాత అందులోనే అల్లం వెల్లుల్ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకూ తకకవ మంట మీద వేయించుకోవాలి.

ఇప్పుడు అందులో క్యాప్సికమ్, మరియు మెంతి ఆకు తరుగు వేసి బాగా ప్రై చేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత అందులో టమోటాలను వేసి టమోటో మెత్తబడి వరకూ వేయించుకోవాలి. తర్వాత కారం, ధనియాలపొడి, ఉప్పు వేసి మరో నిమిషం పాటు వేయించుకొని తర్వాత శుభ్రం చేసి కడిగి పెట్టుకొన్న బియ్యాన్ని కూడా వేసి బాగా మిక్స్ చేయాలి.

అందులో నాలుగు కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకూ పెట్టి పక్కకు దింపేసుకోవాలి. ఐదునిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీరతో గార్నిష్ చేసి రైతాతో హాట్ గా సర్వ్ చేయాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: