కావలసినవి  పుట్ట గొడుగులు 400 గ్రా  ఉల్లిపాయలు 100 గ్రా వేయించిన వెల్లుల్లి 30 గ్రా వేయించిన జీడిపప్పు 50గ్రా  సన్నగా తరిగిన పచ్చిమిర్చి 10గ్రా సన్నగా తరిగిన అల్లం 10 గ్రా నెయ్యి 100 గ్రా యాలకుల పొడి 4 గ్రా  ఉప్పు తగినంత  తయారు చేసే పద్ధతి  ముందుగా పుట్టగొడుగులను శుభ్రం చేసి కాడలు వొలిచి పక్కన పెట్టాలి. వీటిని బాగా ఆరనీయాలి. ఒక పాత్రలో పుట్టగొడుగులు, ఉల్లిపాయలు, వెల్లుల్లి మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమానికి తరిగిన అల్లం, పచ్చిమిర్చి, యాలకుల పొడి, కొద్దిగా నీళ్లు, తగినంత ఉప్పు వేసి కలపాలి. తర్వాత స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టి నెయ్యిని వేడి చేయాలి. ఈలోగా పై మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. వాటిని నేతిలో దోరగా వేయించి వేరే పాత్రలోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేయాలి. ఈ పుట్టగొడుగుల ఫ్రైలో చిల్లీ లేదా టొమాటో సాస్ ను వేసుకుంటే బావుంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: