కోల్డ్ హార్టీ టమాటా కావల్పిన పధార్థాలు : ఎర్రగా పెద్దగా ఉన్న టమాటాలు : నాలుగు   ఎర్ర, ఆకుపచ్చక్యాప్సికం : ఒక్కోటి చొప్పున అలపెనో : 1 కొత్తిమీర తరగు : అరకప్పు తాజా నిమ్మరసం : పావుకప్పు టమాటా రసం : రెండు కప్పు(బజార్లో దొరుకుతుంది. లేదంటే ఇట్లోనే తయారు చేసుకోవచ్చు.)

కీర దోస : ఒకటి, వెల్లుల్లి రెబ్బలు : మూడు(పలుకుల్లా కోయాలి) బ్రెడ్డు స్లైసులు : నాలుగు (దోరగా వేయించాలి) ఉప్పు : మిరియాలపొడి : రుచికి సరిపడా తయారీకి : ముదుగా టమాటా చెక్కు తీసి గింజలు తొలగించి సన్నగా తరగాలి. అలాగే క్యాప్సికం, అలపెనో, కీరదోసల చెక్కు తీసి గింజలు తీసేసి సన్నగా తరగాలి.

బ్రెడ్డు, ఉప్పు మిరియాలపొడి తప్ప మిగిలిన పధార్ధాలన్నీ మిక్సీలోకి తీసుకుని చిక్కని గుజ్జులా చేసుకోవాలి. ఆ తరువాత సరిపడా ఉప్పు, మిరియాల పొడి కలపాలి. వీటన్నింటినీ కప్పులోకి తీసుకుని వేయించిన బ్రెడ్డు ముక్కలు, టమాటా తరుగు వేస్తే కోల్డ్ హార్టీ టమాటా సూప్ రేడీ...  

మరింత సమాచారం తెలుసుకోండి: