బియ్యం : పావు కప్పు ఓట్స్ : కప్పు బీన్స్ : పది  క్యారెట్ : ఒకటి బంగాళాదుంప : ఒకటి, ఉల్లిపాయ : ఒకటి పచ్చిమిర్చి : రెండు అల్లం : చిన్న ముక్క కొత్తిమీర తురుము : పావుకప్పు కిరివేపాకు : రెండు రెమ్మలు ఆవాలు : టీ స్పూను మినపప్పు : టీస్పూను సెనగపప్పు : టీ స్పూను ఉప్పు : రుచికి సరిపడా తయారుచేసే విధానం : కూరగాయాలన్నీ కడిగి పొట్టు తీసి ముక్కలుగా కోసుకోవాలి అల్లం పచ్చిమిర్చి ముద్దలా నూరాలి. బియ్యం కడిగి అరగంట సేపు నాననివ్వాలి. బాణలిలో నూనె వేసి కాగాగ ఆవాలు , మినపప్పు, సెనగపప్పు వేసి వేయించాలి. అవి చిటపటమన్నాక పచ్చిమిర్చి ముద్ద, కూరగాయాల ముక్కలు వేసి వేయించాలి. ఓ నిమిషం తరవాత కడిగి నానబెట్టిన బియ్యం, ఓట్స్ ఉప్పు వేసి కలపాలి. తరవాత తగినన్ని నీళ్లు పోసి మూత పెట్ ఉడికించాలి. అన్నం ఓట్స్ ఉడికిన తరవాత చివరగా కరివేపాకు, కొత్తిమీర తురుము చల్లి దించాలి  

మరింత సమాచారం తెలుసుకోండి: