పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘గోపాలా గోపాలా’ సినిమా గురించి ఒక లేటెస్ట్ న్యూస్ ఫిలింనగర్ లో హడావిడి చేస్తోంది. ఈ వారమే కలియుగ కృష్ణుడిగా గోపాలుడి సెట్లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గెటప్ పై ఎన్నో ఊహలు వస్తున్న నేపధ్యంలో ఆ ఊహలకు బ్రేక్ చేసే ముహూర్తంగా గోపాలుడి నిర్మాతలు కృష్ణాష్టమిని ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఎపి హెరాల్డ్ కు తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సినిమాలోని పవన్ ఫస్ట్ లుక్ కృష్ణాష్టమి రోజున విడుదల చేయడానికి ఈసినిమా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో పవన్ కృష్ణుడు పాత్రలో కలియుగ కృష్ణుడిగా కనిపిస్తూ ఉండటంతో సెంటిమెంటల్ గా వచ్చే నెల ఆగస్టు 16న రాబోతున్న కృష్ణాష్టమి రోజున ఈ సినిమా పవన్ ఫస్ట్ లుక్ విడుదల చేస్తే సెంటిమెంట్ గా బాగుంటుందని కొంతమంది సన్నిహితులు సూచిస్తూ న్నట్లు టాక్. దీనితో పవన్ కృష్ణావతారాన్ని పవన్ అభిమానులకోసం వచ్చే నెల 16న చూపెట్టడానికి ఈ సినిమా యూనిట్ ఇంచుమించుగా నిర్ణయం తీసుకుంది అనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలే నిజం అయితే కృష్ణాష్టమి రోజున పవన్ శ్రీకృష్ణ దివ్య దర్శనం అభిమానులకు కనివిందు చేస్తుంది అనుకోవాలి. సినిమా ఇంటర్వెల్ ముందు కృష్ణుడిగా వెండితెర పై కనిపించే పవన్ ఈ సినిమా సెకండ్ ఆఫ్ లో దాదాపు 25నిముషాల పాటు కనిపిస్తాడని ఫిలింనగర్ టాక్. దీనితో రాబోతున్న కృష్ణాష్టమి పవన్ అభిమానులకు నిజమైన పండుగగా మారబోతోంది అనుకోవాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: