బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ తన లేటెస్ట్ సినిమా ‘కిక్’ ను ప్రమోట్ చేస్తూ పెళ్లి గురించి తన మనసులో మాట బయట పెట్టేసాడు. మీడియాతో తన కిక్ సినిమా గురించి సరదాగా మాట్లాడుతున్న సల్మాన్ దగ్గర మీడియా ప్రతినిధులు పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే చికాకు పడుతూ తనకు ఇప్పటికే 48 ఏళ్ళు దాటిపోవడంతో తాను ఇక సింగిల్‌గానే ఉండాలని నిశ్చయించుకున్నాని అంటూ ‘‘బహుశా నా లైఫ్‌లో నేను మ్యారేజ్ చేసుకోకపోవచ్చు’’ అని చెప్పేశాడు. నేషనల్ టెలివిజన్‌లో ప్రసారమయ్యే ‘‘ఏక్ ములాఖాత్’’ కార్యక్రమం కోసం ఇంటర్వ్యూ ఇచ్చిన సల్లూభాయ్ తన లేటెస్ట్ సినిమా ‘కిక్’ గురించి మాట్లాడుతూ పనిలో పనిగా తన పెళ్లి విషయంపై కూడ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాకుండా తాను భవిష్యత్ లో సామాజిక సేవా కార్యక్రమాలపై దృష్టిపెడతానని క్లారిటీ ఇచ్చాడు సల్మాన్. ‘బీయింగ్ హ్యూమన్’ అనే తన స్వచ్ఛంద సంస్థ ద్వారా కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసుకుని పిల్లల అభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలు చేస్తానని చెపుతున్నాడు ఈ బ్రహ్మచారి. ఈ వార్తలు ఇలా ఉండగా మొన్న ప్రపంచ వ్యాప్తంగా ఐదు వేల ధియేటర్లలో విడుదల అయిన సల్మాన్ ‘కిక్’ డివైడ్ టాక్ తెచ్చుకున్నా కలక్షన్స్ దుమ్ము రేపుతోందని బాలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది. ఈ కలెక్షన్స్ వార్తలతో మరోసారి బాలీవుడ్ కు సల్మాన్ స్టామినా తెలుస్తోంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: