రజనీకాంత్ తో సమానంగా ఒకప్పుడు కోలీవుడ్ లో మాస్ హీరోగా విజయ్ కాంత్ హవా నడిచేది. విజయ్ కాంత్ నటించిన చాల సినిమాలు మన టాలీవుడ్ లో కూడ డబ్బింగ్ సినిమాలుగా విడుదలై మంచి విజయాలను గతంలో నమోదు చేసుకున్నాయి. రాజకీయాల పట్ల ఉండే ఆశక్తితో విజయ్ కాంత్ తాను సొంతంగా డీఎండీకే అనే పార్టీని స్థాపించి తమిళనాడులో గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నికలలో పోటీ చేస్తూ అధికారంలోకి రావడానికి చాల ప్రయత్నాలు చేసాడు. అయితే ఆయన క్రేజ్ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇమేజ్ ముందు నిలబడలేకపోవడంతో గత ఎన్నికలలో సరైన ఫలితాలు అందుకోలేకపోయాడు. అయితే ఎన్నికల తరువాత కూడఉత్సాహంగా పనిచేసిన విజయ్ కాంత్ ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా రూమర్లు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ వర్గాలు ఖండిస్తూ వచ్చారు. అయితే అత్యంత రహస్యంగా ఉంచిన విజయ్ కాంత్ అనారోగ్యం విషయం నిన్న బయట పడింది. గత రెండు వారాలుగా సింగపూర్‌లో ఉన్న విజయకాంత్ నిన్న ఉదయం చెన్నైకు తిరిగి వస్తున్నాడు అని వార్తలు రావడంతో కోలీవుడ్ మీడియా అంతా నిన్న చెన్నై ఎయిర్ పోర్ట్ లో విజయ్ కాంత్ కోసo చూసింది. అయితే విమానం చెన్నైలో ల్యాండ్ అయిన తరువాత విజయ్ కాంత్ భార్య ప్రేమలత ఎయిర్ పోర్ట్ బయటకు వచ్చి విజయ్ కాంత్ రాలేదు అన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. అయితే మరి కొద్ది సేపటికి విజయకాంత్ ను ఎయిర్ పోర్ట్ సిబ్బంది విజయ్ కాంత్ ను వీల్ చైర్ లో కూర్చో పెట్టి రహస్యంగా తీసుకు రావడం మీడియా కంట పడింది. మీడియా దృష్టిని తప్పుదారి పట్టిస్తూ విజయ్ కాంత్ ను రహస్యంగా ఆయన కారులో ఇంటికి తీసుకు వెళ్లి పోవడంతో ఆవార్తను ఈరోజు కోలీవుడ్ మీడియా ప్రముఖంగా ప్రచురించడమే కాకుండా విజయ్ కాంత్ అనారోగ్యం పై రకరకాల వార్తలను ప్రచురించడంతో అసలు విజయ్ కాంత్ కు ఏమైంది? అన్న టెన్షన్ లో కోలీవుడ్ పరిశ్రమ ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి: