కోలీవుడ్ హీరో విజయ్ కు తాను నటించిన సినిమాలను విడుదల చేసుకోవడం కత్తి మీద సాములా మారింది. గతసంవత్సరం విజయ్ నటించిన ‘తలైవా’ సినిమాకు కూడా తమిళ ప్రజల ఆగ్రహ జ్వాలలు తగిలాయి. అతి కష్టం పై ఆ సినిమాను క్రితం సంవత్సరం విడుదల చేసారు. ఇప్పుడు విజయ్ నటిస్తున్న ‘కత్తి’ సినిమా మరో వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది అనే వార్తలు వస్తున్నాయి. నిన్న రాత్రి దీపావళి రోజు విడుదల కాబోతున్న ఈ సినిమాను ప్రదర్శించ రాదంటూ చెన్నైలో తమిళ సంఘాలు నిరసనకు దిగాయి. సోమవారం రాత్రి కొన్ని గుంపులు మూడు థియేటర్ల మీద దాడిచేసి అద్దాలు బద్దలు గొట్టి, కిరోసిన్ బాంబులు విసిరారు అనే వార్తలు వస్తున్నాయి.  దీనికి కారణం ఈ సినిమా నిర్మాత శ్రీలంక దేశానికి చెందిన వ్యక్తి కావడం అని అంటున్నారు. ఈ కారణంతో ఈ సినిమాను ప్రదర్శిస్తే ధియేటర్లను టార్గెట్ చేస్తాము అని కొన్ని తమిళ సంఘాలు ఇప్పటికే హడావిడి చేస్తున్నాయి. ఈ వార్తల నేపధ్యంలో ఈ సినిమా హీరో విజయ్ రంగంలోకి దిగి తమిళ సంఘాలు వ్యతిరేకిస్తున్న ఈ సినిమా పోస్టర్ పై ఉన్న లైకా లోగోను తీసివేస్తామని ఈ సినిమా నిర్మతుల చేత ప్రకటింప చేసాడు.  అయినా చాలామంది ధియేటర్ల ఓనర్స్ ఈ సినిమాను విడుదల చేయడానికి భయపడి పోతున్నట్లుగా కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మురగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే.    

మరింత సమాచారం తెలుసుకోండి: