‘అంజాన్’ నిరాశ పరచడంతో సూర్య తాను ప్రస్తుతం నటిస్తున్న ‘మాస్’ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. కోలీవుడ్ సినిమా రంగంలో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరుగాంచిన వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నిన్న మంగళ వారం అర్ధ రాత్రి విడుదల చేసారు.  అయితే ఈ ఫస్ట్ లుక్ విడుదల అయిన కొన్ని గంటలలోనే ఈ సినిమా ఒక ప్రముఖ ఇంగ్లీషు సినిమాకు కాపీ అంటూ వార్తలు చుట్టుముట్టుతున్నాయి. దీనికి కారణం సూర్య నటిస్తున్న మాస్ సినిమా లోని ఫస్ట్ లుక్ పోస్టర్ హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'ద బోర్న్ అల్టిమేటం' కు మక్కీకి మక్కీగా కనిపిస్తూ ఉండటం తో కొంతమంది అప్పుడే విమర్శలు మొదలు పెట్టేసారు.  ఈ హాలీవుడ్ సినిమాలోని హీరో కుడా అచ్చు మాస్ సినిమాలోని సూర్యాలాగే నల్లరంగు పూసుకుని లుక్ లో ఉన్న పోస్టర్లను సూర్య మాస్ సినిమా పోస్టర్ పక్కన పెట్టి ఇది కాపీ లుక్ అంటూ వ్యాఖ్యలుచేస్తూ వెబ్ మీడియాలో హడావిడి చేస్తున్నారు.  సూర్యా తో నయనతార, అమీ జాక్సన్ లు నటిస్తున్న ఈ సినిమా విజయం సూర్య కెరియర్ కు సంభందించి చాల అవసరం. అన్నీ అనుకున్నట్లు గా జరిగితే ఈ సినిమాను కోలీవుడ్ లో వచ్చే సమ్మర్ రేస్ కు బరిలో దింపాలనే ఆలోచనలో ఈ సినిమా నిర్మాతలు ఉన్నట్లు సమాచారం..  

మరింత సమాచారం తెలుసుకోండి: