టాలీవుడ్ యాంగ్రీ హీరో రాజశేఖర్ అమ్మాయిల డార్లింగ్ ప్రభాస్ పుట్టిన రోజున విడుదల చేసిన ‘బాహుబలి’ లేటెస్ట్ స్టిల్ ను టార్గెట్ చేస్తున్నాడా? అన్నవిధంగా తన రఫ్ లుక్ తో ఉన్న తన న్యూ మూవీ " గడ్డం గ్యాంగ్ " ఫస్ట్ లుక్ ను దీపావళి రోజున విడుదల చేసి అందరికీ షాక్ ఇచ్చాడు.  తమిళ్ హిట్ " సూదు కవ్వుమ్ " రీమేక్‌గా సంతోష్ డైరెక్ట్ చేసిన ఈమూవీకి నిర్మాత జీవితా రాజశేఖర్. క్రేజ్ పరంగా కెరియర్ పరంగా చాలా వెనుకంజ లో ఉన్న రాజశేఖర్ ఈసినిమా పై చాలా అంచనాలు పెట్టుకున్నాడు. చాలాకాలం తరువాత ఈసినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపిస్తూ తనలో ఇంకా ఒకప్పటి స్పీడ్ తగ్గలేదు అనే సంకేతాలు ఇస్తున్నాడు.  గడ్డం దాస్‌గా ఒక రఫ్ పాత్రలో నటిస్తున్న రాజశేఖర్ పాత్రను ఈసినిమాలో కాస్త డిఫెరెంట్ గా చూపెట్టారు అనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఒక సాంగ్ తప్ప మిగతా షూటింగ్ పూర్తి అయిన ఈసినిమా కూడా విజయవంతం కాకపోతే టాలీవుడ్ లో రాజశేఖర్ కెరియర్ ముగిసిపోయిందనే అనుకోవాలి.  నవంబర్ ఫస్ట్ వీక్‌లో ఆడియో రిలీజ్ చేసి అదే నెలలో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్న ఈ సినిమాకు అయినా ఈ దీపావళి అదృష్టాన్ని కలుగ చేస్తుందో లేదో చూడాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: