పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘విక్టరీ’ వెంకటేష్ నటిస్తున్న ‘గోపాల గోపాల’ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ రెడీ చేసింది. దీనిని త్వరలోనే రిలీజ్ చేసుందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఓ వైపు పోస్ట్ ఈ మూవీకి సంబంధించిన ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుంటే మరోవైపు గోపాల గోపాల మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రం దాదాపు 70 శాతం షూటింగ్ ని ఇప్పటికే పూర్తి చేసుకుంది. ఇంకో రెండో వారాల్లో ‘గోపాల గోపాల’ లోని పవన్ పాత్ర కి సంబందించిన షూటింగ్ పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత ‘గబ్బర్ సింగ్ 2′ షూటింగ్ లో పాల్గొనున్నారు. అయితే గోపాల గోపాల మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ విషయంలో మొత్తం 2 ఫస్ట్ లుక్స్ ని రెడీ చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. ఒకటి మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ అయితే రెండోది పవన్ కళ్యాణ్, వెంకటేష్ ల మీద రిలీజ్ అవుతుంది. అందుకోసం ఇప్పటికే డిజైన్ చేసిన ఈ ఫస్ట్ లుక్ ని వెంకటేష్, పవన్ కళ్యాణ్ లకి చూపించడం కోసం చిత్ర యూనిట్ సన్నాహాలు చేసింది. వీరిద్దరూ ఒకటి రెండు రోజుల్లో ఫస్ట్ లుక్ ని చూసి గ్రీన్ సిగ్నల్ ఇస్తే తరువాత వాటిని రిలీజ్ చేయనున్నారు. మొత్తానికి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రేజీ ప్రాజెక్ట్ గా పేరు తెచ్చుకున్న గోపాల గోపాల రిలీజ్ తరువాత ఎంత మాత్రం ప్రేక్షకులని అలరిస్తుందో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చెయ్యాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: