‘రుద్రమదేవి' సినిమాలో రాణి రుద్రమగా కాకతీయ పౌరుషాన్ని చూపెట్టిన అనుష్క పాత్రతో సమానంగా ఈ సినిమాలో చాళుక్య వీరభద్రునిగా నటించిన రానా ఈ సినిమా కోసం పడ్డ కష్టాలను వింటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ సినిమాలో రుద్రమదేవి పాత్రతో సరిసమానమైన ప్రాముఖ్యత, రానా నటిస్తున్న చాళుక్య వీరభద్రుడి పాత్రకు ఉంది.  13 వ శతాబ్దం రాజైన చాళుక్య వీరభద్రుని చరిత్ర గురించి పూర్తిగా అధ్యయనం చేసేందుకు రానా స్వయంగా నిడదవోలు వెళ్లి అక్కడి చరిత్రకారులను కలిసి వివరాలన్నీ తెలుసుకున్నాడట. ఆనాటి రోజులలో నిడదవోలును నిడవారాధ్యపురం అని పిలిచేవారని, దానికి వీరభద్రుడు రాజుగా వ్యవహరించాడని చరిత్రకారులు చెపుతూ ఉంటారు. ‘రుద్రమదేవి’ చరిత్రలో ఒక ప్రాముఖ్యత ఉన్న చాళుక్య వీరభద్రుడు రుద్రమదేవిని ప్రేయసిగా ఆరాధించే ఒక భగ్న ప్రేమికుడు అనే కధనాలు ఉన్నాయి. రుద్రమదేవి కాకతీయ సామ్రాజ్య విస్తరణలో చాళుక్య వీరభద్రుడి కృషి చాల ఉంది అని అంటారు. ఇంత ప్రాముఖ్యత గల తన పాత్రకు సంబంధించిన తన డైలాగ్ స్క్రిప్ట్ ను రానా ముందుగా తెప్పించుకుని స్పష్టమైన ఉచ్చారణతో చాల కష్టపడి ప్రాక్టీసు చేసి నటించాడని టాక్. అంతేకాకుండా ఈ సినిమాలో 30 సార్లు తన గెటప్ లను మార్చడమే కాకుండా అలనాటి సంస్కృతిని ప్రతిబింబించే కాస్ట్యూమ్స్ ను రీసర్చ్ చేసి ధరించాను అని రానా చెపుతున్నాడు. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో ఎన్నో పాత్రలు చేసిన రానాకు ఏ సినిమా కలిసి రాని నేపధ్యంలో ఈ చాళుక్య వీరభద్రుని పాత్ర అయినా కలిసి వస్తుందేమో చూడాలి..   

మరింత సమాచారం తెలుసుకోండి: