టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం టెంపర్ మూవీకి సంబంధించిన ఆసిక్తిక టాక్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ షర్ట్ లెస్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకూ తన మూవీలలో ఎటువంటి బాడీని ఎక్స్ పోజ్ చేయని జూనియర్, తన అప్ కమింగ్ ఫిల్మ్ లో మాత్రం బాడీ న్యూడిటికి పని చెప్పబోతున్నాడు. మేటర్ లోకి వెళితే జూనియర్ ఎన్టీఆర్, పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అప్ కమింగ్ ఫిల్మ్ టెంపర్. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఊడ ఊపందుకున్నాయి. టెంపర్ మూవీని జనవరి నెలలో సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుందనే విషయం తెలిసిందే. అందుకే మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తున్నప్పటికీ, ఇప్పటి వరకూ ఈ మూవీకి సంబంధించిన ఎటువంటి ప్రమోషన్ బయటకు రావడం లేదు. ముఖ్యంగా పూరీ జగన్నాధ్, జూనియర్ ఎన్టీఆర్ ల కాంబినేషన్ పై నెగిటివ్ టాక్స్ తప్పితే, పెద్దగా పాజిటివ్ న్యూస్ ఇప్పటి వరకూ రాలేదు. సీన్ కట్ చేస్తే టెంపర్ మూవీ హెలెట్స్ లో జూనియర్ ఎన్టీఆర్ షర్ట్ లెస్ దుమ్ములేపుతుంది. జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా సెమి న్యూడ్ తో కనిపిస్తున్న చిత్రంగా టెంపర్ ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. టెంపర్ మూవీని బాక్సాపీస్ వద్ద కచ్ఛితంగా దుమ్ముదులపాలనే ఉద్ధేశంతోనే చిత్ర టీం చాలా కష్టపడుతుంది. మొత్తంగా జూనియర్ షర్ట్ లెస్ ఫోటో ఇప్పుడు మీడియాతో పాటు, అభిమానులని తెగ అలరిస్తుంది. ఇక్క జూనియర్ ని అభిమానించే అమ్మాయిలు అయితే, జూనియర్ ని ఈ గెటప్ లో చూసి ఫుల్ హాట్ అని కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: