ప్రేక్షకులు విభిన్నమైన కథలతో కూడిన సినిమాలను కోరుకుంటూ ఉండటంతో ఆ తరహాలోనే సినిమాలు నిర్మించడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ బిపాసాబసు లేటెస్ట్ గా నటిస్తున్న మూవీ ‘ఎలోన్’ ఒక విభిన్నమైన కథాంశంతో నిర్మిస్తున్న చిత్రం. ఈ సినిమా ట్రైలర్‌కి నెటిజన్ల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. సస్పెన్స్, హారర్‌ తరహాలో కొనసాగే ఈ సినిమాలో బిపాసా తన అందాలను విపరీతంగా ఆరబోసింది అనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో బిపాసా తన సహనటుడు కరణ్‌సింగ్‌తో చేసిన హాటెస్ట్, బోల్డ్ సీన్స్ ఈ సినిమాలో విపరీతంగా ఉంటాయని ప్రచారం జరుగుతోంది.  రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను డిసెంబర్ 9న ముంబైలో విడుదల చేశారు. కేవలం పది రోజుల్లోనే 46 లక్షల హిట్స్ రావడంతో యూనిట్ ఆనందంగా వుంది. ఇక హీరోయిన్ బిపాసా అయితే చాల రోజుల తరువాత తాను నటించిన సినిమాకు ఈ రేంజ్ లో క్రేజ్ రావడానికి తన హాట్ లుక్స్ కారణం అని అంటోంది.  ఓ యువకుడికి, యువతికి, దెయ్యానికి మధ్య నడిచిన లవ్ స్టోరీయే ఈ సినిమా అని తెలుస్తోంది. ఈ చిత్రం ద్వారా టీవీ నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ మొదటిసారి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా జనవరి 16న రిలీజ్ కానుంది.మరి బిపాసా అందాలు ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్స్ కురిపిస్తుందో చూడాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: