కర్నూల్ లో తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగాడు కేఈ ప్రభాకర్. ఈయన కర్నూలు ఎంపీ స్థానం నుంచటి టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించి అది దొరక్కపోవడంతో రెబల్ గా నామినేషన్ వేశాడు.వేసింది రెబల్ గా నే అయినా ఇండిపెండెంట్ గా కాదు! ఈ రెబల్ అభ్యర్థి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశాడు. ఇది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కి ఇబ్బందికరమైన పరిణామంగా మారింది. అదెలాగంటే...సమాజ్ వాదీ పార్టీ గుర్తు సైకిల్! ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తును కేటాయించిన ఎన్నికల కమిషన్ యూపీలో ములాయం సింగ్ యాదవ్ కు చెందిన సమాజ్ వాదీ పార్టీకి కూడా సైకిల్ గుర్తును ఇచ్చింది. అయితే తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ మాత్రమే. సమాజ్ వాదీ పార్టీ మాత్రం యూపీతో సహా బీహార్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో పోటీ చేస్తూ జాతీయ పార్టీ గుర్తింపును సాధించుకొనే ప్రయత్నంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కర్నూలులో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కేఈ ప్రభాకర్ కు ఏ గుర్తు వస్తుంది ? అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఏపీలో తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు ఉంది కాబట్టి సమాజ్ వాదీ పార్టీకి వేరే గుర్తు ఇస్తారా? లేక తెలుగుదేశం పార్టీకే షాక్ నిస్తారా? అనే విషయంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. కేఈ ప్రభాకర్ కూడా వ్యూహాత్మకంగానే సమాజ్ వాదీ పార్టీ బీఫారాన్ని సంపాదించినట్టు తెలుస్తోంది. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో...!

మరింత సమాచారం తెలుసుకోండి: