హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో స్టూడెంట్స్ గల్లంతైన ఘటన మర్చిపోక ముందే..మాసాయిపేట ఘటన జరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా దిగ్భ్రాంతి నెలకొంది. బియాస్ నదిలో గల్లంతైన వారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కాగా.. మాసాయిపేట ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయింది మాత్రం స్కూల్ పిల్లలు. తప్పు ఎవరిదైనా శోకం మాత్రం తల్లిదండ్రులకే మిగిలింది. అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలు…అనుకోని ఘటనలకు బలౌతున్నారు….కానరాని లోకాలకు వెళ్లిపోతున్నారు.   వీఎన్నార్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ స్టడీటూర్ కోసం హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లి.. బియాస్ నదిలో గల్లంతైన విషయం తెలిసిందే. నెలరోజుల తర్వాత మళ్లీ మాసాయిపేట ట్రైన్ యాక్సిడెంట్ జరగడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల నిర్లక్ష్యం వల్ల పిల్లల ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పేరెంట్స్. ప్రైవేట్ విద్యాసంస్ధలపై ప్రభుత్వం కంట్రోల్ ఉండేలా చర్యలు తీసుకోవాలని వారంటున్నారు. విజాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీపై కఠిన చర్యలు తీసుకోవాలని పలుసార్లు బాధిత పేరెంట్స్ ఆందోళనలు చేసినా ఇప్పటి వరకు అధికారులు పట్టించుకోలేదు. మళ్లీ మాసాయిపేట యాక్సిడెంట్ జరగడంతో ఆ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: