సగటు ఆంధ్రప్రదేశ్ రైతు దృష్టిలో ఇప్పుడు రుణమాఫీ జరిగిపోయింది! తనకు బ్యాంకులో ఎలాంటి రుణం లేదు. వ్యవసాయం కోసం తెచ్చుకొన్న లోన్లన్నీ మాఫీ అయ్యాయి..! ఇక బ్యాంకుల్లో తనఖాలో ఉన్న బంగారం కూడా రేపో మాపో బయటకు తెచ్చుకోవచ్చు. బ్యాంకులో ఉన్న ఏ లోన్లకు కూడా వడ్డీలు కట్టాల్సిన అవసరం లేదు! అలా కట్టకపోయినా.. ఎవరూ తనను ఏమంటూ ప్రశ్నించరు! ఇదీ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల,రైతుల పరిస్థితి! తెలుగుదేశం ప్రభుత్వం రుణమాణీ చేసేశామని ప్రకటించడం, లక్షన్నర పరిమితితో కుటుంబంలోని ఒకరి పేరుతో ఉన్న రుణాలను రద్దు చేయాలని మాఫీ చేయాలని క్యాబినెట్ లో నిర్ణయం జరిగిపోయిందన్న ప్రచారం... రైతులను అలాంటి స్థితి తీసుకెళ్లింది. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంద్రబాబును కీర్తిస్తూ పాటల సీడీలను కూడా తీసుకురావడంతో రుణమాఫీ జరిగిపోయిందనే భావన అధికం అయ్యింది. అయితే ఇప్పుడు మళ్లీ రీషెడ్యూల్ అనే వార్త రావడం ఆసక్తికరంగా మారింది. తెలుగుదేశం వాళ్లు రుణమాఫీ జరిగిపోయిందన్నారు.. ప్రజలు ఆ భావనకు వచ్చేశారు. అయితే ఇప్పుడు మళ్లీ రిజర్వ్ బ్యాంకు జోక్యం చేసుకొంది. రైతు రుణాలను తాము ఎటువంటి పరిస్థితుల్లోనూ రీ షెడ్యూల్ చేయలేమని ఆర్ బీఐ ప్రకటించింది. తమకున్న నియమావళి ప్రకారం.. ఇప్పుడు రీ షెడ్యూల్ చేసే అవకాశం లేదని..ఐదేళ్లుగా రైతుల పరిస్థితి, వాతావరణ పరిస్థితిని బట్టి చూస్తే.. ఇప్పుడు రీ షెడ్యూల్ చేయలేమని తమ రూల్స్ బుక్ లోని నియమాల గురించి చెబుతోంది ఆర్ బీఐ! మరి ఒకవైపు ప్రభుత్వం రుణమాఫీనే జరిగిపోయిందని అంటోంది. మేము బ్యాంకులకు చెల్లించేశాం.. రైతులెవరూ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదంటోంది! అయితే ఆర్ బీఐ రుణమాఫీ గురించి మాటెత్తకపోగా.. రీ షెడ్యూల్ కూడా వీలుకాదనే ప్రకటన చేసింది! మరి ఏమిటో ఈ గందరగోళం!

మరింత సమాచారం తెలుసుకోండి: