యువతీయువకుల్లో నెలకొన్న సెల్ఫీ క్రేజ్‌ని ఆకట్టుకోవడానికి జపాన్‌కు చెందిన టెక్నాలజీ దిగ్గజం సోనీ తాజాగా మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. డిజిటల్ ఈమేజింగ్ టెక్నాలజీతో రూపొందించిన ఎక్స్‌పిరియా సీ3 ధర రూ.23,999గా నిర్ణయించింది. sony 5.5 అంగుళాల టచ్‌స్క్రీన్, 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, వీడియో కాలింగ్ కోసం ముందుభాగంలో 5 మెగాపిక్సెల్ కెమెరా, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ క్వాడ్-కోర్ 1.2 గిగాహెడ్జ్ ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమొరీ,డ్యూయల్ సిమ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. నేడు విడుదల చేసినప్పటికీ సెప్టెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎలక్ట్రానిక్ స్టోర్లలో లభ్యమవనుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. సెల్ఫీ కెమెరా యాప్స్ లోడ్ చేయడంతో ఫోటోలు మరింత నాణ్యవంతంగా వచ్చేందుకు వీలుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: