యన్.టీ.ఆర్.గారి వ్యక్తిత్వం అసాధారణమయింది, ఆకర్షనీయమైంది. కఠోర శ్రమ, దీక్ష క్రమశిక్షణలతో విలక్షణ వ్యక్తిత్వాన్ని కలిగి ఉండేవారు. ఆయన ఆలోచనలు నిత్య నూతనం. ఎప్పుడూ ఏదో చేయాలనే ఆలోచన తపన, ఏదో సాధించాలనే పట్టుదల ఆయనను అందరిలో ప్రత్యేకంగా చూపేవి. సినిమా రంగంలో ఆయనకు ఆయనే సాటి ఆయనకు ఎవరూ లేరు పోటి. ఆయన నటించిన ఏ పాత్ర అయినా సరే ఆయన కోసమే సృష్టంప పడ్డవా అన్నట్టుగా ఉండేవి..

రాముడిగా,కృష్ణుడిగా, భీముడిగా, అర్జునిడిగా, దుర్యోధనుడిగా,భీష్ముడిగా,రావణ బ్రహ్మగా, హరిశ్చంద్రుడిగా, విక్రమాదిత్యునిగా, శ్రీకృష్ణ దేవరాయలుగా పౌరాణిక పాత్రలు ఏవైనా సరే వాటికి న్యాయం చేసినట్లుగా ఉండేవి. మనసా వాచా కర్మణ ఆ పాత్రల స్వభావాన్ని ఆయన నరనరాన జీర్జించుకొని ఆ పాత్రల్లో లీనమైపోయేవారు. ఇక సాంఘిక చిత్రాల్లో మద్య తరగతి మనిషిగా, పేద, ధనిక పాత్రల్లో ఏ పాత్ర అయినా సరే షెభాష్ అనే లా నటించడం ఆయనకే చెల్లింది. ఇలాంటి మహానటుడు ఇక సినిమాల్లో లేరు,రారు కూడా. ఇక రాజకీయ రంగంలో ఆయన పెను సంచలనమే సృష్టించారు.

తెలుగు ప్రజల నాడి తెలిసినవాడిగా తెలుగు ప్రజల కోసం ఒక గొప్ప పార్టీనే ఆయన స్థాపించారు. తెలుగు దేశం పార్టీ ఎన్ని సంచలనాలకు తెర లేపిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో యేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి పెను సవాలుగా మారి తెలుగు దేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి మార్పులు తెచ్చిందే వేరే చెప్పనవసరం లేదు. యన్.టీ.ఆర్.గారు ప్రజల కోసం అనేకం చేశారు. అవన్నీ ఆయన సొంత పద్దతిలోనే తన వినూత్న విలక్షణ ఆలోచనలకు అనుగుణంగానే.

వ్యవస్థాపరమయిన ఎన్నో మార్పులు ఆయన సంస్కరణాభిలాషకు ప్రత్యక్ష సాక్ష్యాలు. తెలుగు జాతికి తొలిసారి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు గౌరవం తెచ్చిపెట్టారు. అప్పటి వరకు పాలకులే దేవుళ్లుగా చెలామని అయ్యేవారు. మొదటి సారిగా ప్రజలే దేవుళ్లు అనే నినాదం ఆయన నుండే పుట్టింది. యన్.టీ.ఆర్.కి ఆవేశం, ఆత్మాభిమానం ఎక్కువే. కుటుంబం అంటే అమితమయిన ప్రేమ. అందుకే మేం ఆయన అడుగు జాడల్లోనే ఆయన అందించిన స్పూర్తితోనే ముందుకు సాగుతాం.

మరింత సమాచారం తెలుసుకోండి: