మేష రాశి     => ఆదాయం: 11;        వ్యయం: 05;        గౌరవం: 02;      అవమానం: 04. వృషభ రాశి   => ఆదాయం: 05;        వ్యయం: 14;       గౌరవం: 05;      అవమానం: 04. మిథున రాశి  => ఆదాయం: 08;        వ్యయం: 11;       గౌరవం: 01;      అవమానం: 07. కర్కాటక రాశి => ఆదాయం: 02;        వ్యయం: 11;       గౌరవం: 04;      అవమానం: 07. సింహ రాశి   => ఆదాయం: 05;         వ్యయం: 05;       గౌరవం: 07;      అవమానం: 07.   కన్యా రాశి    => ఆదాయం: 08;         వ్యయం: 11;       గౌరవం: 03;      అవమానం: 03. తులా రాశి   => ఆదాయం: 05;         వ్యయం: 14;       గౌరవం: 06;      అవమానం: 03. వృశ్చిక రాశి  => ఆదాయం: 11;         వ్యయం: 5;        గౌరవం: 02;      అవమానం: 06. ధనస్సు రాశి => ఆదాయం: 14;          వ్యయం: 11;      గౌరవం: 05;      అవమానం: 06. మకర రాశి   => ఆదాయం: 02;         వ్యయం: 08;       గౌరవం: 01;      అవమానం: 02. కుంభ రాశి   => ఆదాయం: 02;          వ్యయం: 08;      గౌరవం : 04;      అవమానం: 02. మీన రాశి   => ఆదాయం: 14;           వ్యయం: 11;      గౌరవం : 07;      అవమానం: 02.   
ఈ రాశి వారికి గురుడు సంవత్సరమంతా జన్మంలో శని, రాహులు ఇద్దరు సంవత్సరమంతా కూడా పంచమంలో, కేతువు లాభ స్థానంలో సంవత్సరమంతా సంచరిస్తున్నారు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సారి మెరుగ్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చును. ఆదాయం: 8 వ్యయం: 11 గౌరవం: 01 అవమానం: 07 ఈ సంవత్సరం శుభా శుబాలు మిశ్రమంగా ఉంటాయి అంటే చేసే పనిలో శ్రద్ద అంకిత భావం అవసరం తొందరపాటు కూడదు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది సంతోషంను పొందుతారు మంచి పేరును ఒక వర్గంలో సంపాదించుకోగలుగుతారు. పనుల విషయంలో శ్రమ పెరుగుతుంది అలాగే ఖర్చులను నియంత్రించుకోలేక పోతారు అందుమూలన ఖర్చులు పెరుగుతాయి. సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోక పోవడం చేత అలాగే చోరువ చూపకపోవడం మూలన అనేక రకములైన వ్యహరాల్లో వెనక బడుతారు అనగా ముందుకు వెళ్ళడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ విషయంలో చాల వరకు అప్రమత్తంగా ఉండటమనేది సూచన. చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుతాయి ముందు మీరు గతంలో చేపట్టిన పనులను పూర్తి చేయుటకు కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం భాద్యతగా పూర్తి చేయుట మంచిది కాకపోతే కొద్దిగా ముందుచూపు శ్రద్దను చూపడం శ్రమ చేసినచో కొన్నింటినైన అధిగమిస్తారు. విద్యార్థులు సమయాన్ని వ్యర్థం చేయకండి అలాగే కొద్దిగా ప్రణాలికా ప్రకారం వెళ్ళడం చెడు స్నేహాలకు దూరంగా ఉండటం అనేది మేలు చేస్తుంది. వ్యాపారస్థులు ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు కూడదు సామాన్యంగా ఉంటుంది కావున నిదానంగా వ్యవహరించండి ఇష్టం వచ్చినట్లు పెట్టుబడులు పెట్టకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అలాగే భాగస్వామి ఒప్పందాల పట్ల జాగ్రత్త అవసరం కొంత అప్రమత్తంగా ఉండటం అనేది సూచన. రైతులు కూడా లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోకండి మీ వీలును బట్టి చేయండి అలాగే మీకు పంటలో దిగుబడులు సామాన్యంగా ఉంటాయి కావున ముందుచూపుతో వ్యహరించండి. కళాకారులు కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోక ఇంతకు ముందు చేపట్టిన పనులను శ్రద్దగా పూర్తిచేయుట మేలు చేస్తుంది. నూతన సమస్యలను ఎదుర్కొనేటప్పుడు పెద్దల సలహాలను పాటించుట మంచిది. నిరుద్యోగులు మాత్రం బాగా శ్రమించాలి నిరాశ తపకపోవచ్చును చిన్న ఉద్యోగాలను సైతం స్వీకరించుట మంచిది కొద్దిగా అధికంగా శ్రమను పొందుటకు అవకాశం ఉంది వేచిచూసే దొరని కలిగి ఉండటం చేయండి. ఉద్యోగులు ఉద్యోగ స్థానంలో మీ పై అధికారులతో జాగ్రత్తగా ఉండటం నిదానంగా వ్యహరించుట చేయండి తగినంత అప్రమత్తంగా ఉండటం అనేది ఉత్తమం అలాగే బదిలీలు తప్పక పోవచ్చును ఈ విషయంలో అసంతృప్తి ఉండేందుకు అవకాశం ఉంది. రాజకీయనాయకులకు మాత్రం బాగుటుంది పదవులు వరిస్తాయి అభివృద్దిని పొందుతారు కొత్త కొత్త భాద్యతలు స్వీకరిస్తారు. అనారోగ్య విషయంలో మాత్రం అశ్రద్ద చేయకండి ఎందుకంటే కొంత మేర ఇబ్బందులు తప్పక పోవచ్చును. ఋణయత్నములకు దూరంగా ఉండటం అనేది మంచిది పట్టుదలనే ఆయుధంగా చేసుకోవడం మేలు. మాసముల వారిగా: ఏప్రిల్: అకారణంగా ధనవ్యయాలు కలుగుటకు అవకాశం కలదు వృత్తి ఉద్యోగంలో మాములుగా ఉంటుంది. విద్యార్థులు ఒకటికి రెండుసార్లు చదవడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మే: అనారోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఆదాయం తగ్గుటకు ఆస్కారం ఉంది. వివాదములకు దూరంగా ఉండటం సూచన. పట్టుదలతొ పనులు చేయండి మీ పనులను మీరు చేసుకోనుట మంచిది. జూన్: చిన్న చిన్న ప్రయాణాలు చేస్తారు కొంత వైరాగ్యంగా ఉంటారు ఆ దిశగా మీ యొక్క ఆలోచనలు పెరుగుతాయి. నూతన ఆలోచనలు వ్యాపారాలు చేయకండి. పితృవర్గం నుండి ఆదాయం లభిస్తుంది అలాగే విద్యార్థులు కళాశాలల ప్రవేశాలకోసం కొంత గట్టిగా ప్రయత్నం చేయండి. జూలై: ఆర్థిక పరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు చేపట్టుట ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించుట చేయండి. కుటుంభంలో బాగుటుంది ఉద్యోగులకు ప్రమోషన్ తో కూడిన బదిలీలు ఉంటాయి. ఆగష్టు: ఆదాయం కొంత మెరుగుపడుతుంది. వివాహముల విషయంలో కొద్దిగా శ్రమించుట వలన ముందుకు వెళతాయి. విద్యార్థులు కొంత జగ్రత్తలు తీసుకోండి సెప్టెంబర్: శత్రువుల మూలాన కష్టములు కలుగుటకు అవకాశం కలదు. ముఖ్యమైన పనులకోసం రునములు తీసుకుంటారు. ఉద్యోగంలో కొంత మేర ఒత్తిడి పెరుగుటకు అవకాశం కలదు. అక్టోబర్: చేపట్టిన పనులను పూర్తిచేయుటకు ఖర్చులు పెరుగుతాయి భాగస్వామ్య వ్యాపారాలలో తగిన జాగ్రత్తలు అవసరం లౌఖ్యంగా ఉండండి. ఉద్యోగంలో నిదానంగా వ్యహరించుట మేలుచేస్తుంది. నవంబర్: ఆర్థిక పరమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. బంధుమిత్రులతో కాస్త తక్కువగానే వ్యహరించుట మేలు చేస్తుంది. పనులు మాములుగానే పూర్తి అవుతాయి చిన్న చిన్న ఆటంకాలు తప్పకపోవచ్చును. డిసెంబర్: కుటుంభంలో చిన్న చిన్న మనస్పర్థలు కలుగుటకు అవకాశం ఉంది కావున సర్డుబాటు విధానం అవసరం. ఆదాయంలో కొంత పెరుగుదల ఉంటుంది అవసరాలు తీరుతాయి. అధికారులతో సంయమనంగా ఉండాలి. జనవరి: వాహనములు నడుపున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఉద్యోగంలో సహొద్యొగులతొ నిదానంగా వ్యహరించుట మంచిది.ఇతరులను మీ వ్యక్తిగత విషయాలకు దూరంగా ఉంచడం మంచిది.  ఫిబ్రవరి: ధార్మికకార్యములలో పాల్గొంటారు కొంత ఉత్సాహంను కలిగి ఉంటారు.ఆర్థికంగా కొంత మెరుగుకనిపిస్తుంది. బంధుమిత్రులను కలిసే అవకాశం కలదు. మార్చి: మీకు రావలిసిన వాటికోరకు చేయు ప్రయత్నాలలో కొంత అటుఇటుగా ఉండటం మంచిది. వివాహం కోసం ఆలోచనలు ప్రారంభమవుతాయి. పూజలు: ప్రతిరోజు ఆదిత్యహృదయం చదవడం అలాగే శ్రేరామ రక్షాస్తోత్రం చదవండి ప్రతి మాసం శివునకు అబిషేఖం చేయించండి వీలైనప్పుడు సోమవారలు అలాగే గురువారాలు శివాలయం సందర్శించుట మంచిది. శని త్రయోదశి పూజలు చేయడం శనివారాలు ఆంజనేయ దేవాలయం వెళ్ళండి. సుబ్రమణ్య ఆరాధన అలాగే దుర్గాదేవికి పూజలు చేయించండి. ప్రతి మంగళవారం ఉపవాసాలు చేయడం అలాగే ఆరోజు మీకు ఇష్టమైన దేవాలయం వెళ్ళండి. రాహు, కేతువులకు మంగళ వారాలు పాలు పోయడం లేదా ప్రదక్షణలు చేయడం మంచిది. దానాలు లేదా జపాలు: గురునకు శనగలు దానం చేయండి జపం చేయంచుట కూడా మంచిదే శనికి నల్లనువ్వులు దానం ఇవ్వడం జపం చేయించుకోవడం మేలు నవగ్రహాలకు పూజలు చేయండి. అదృష్ట సంఖ్యలు: 5, 14, 23 

మరింత సమాచారం తెలుసుకోండి: