మేష రాశి => ఆదాయం: 11 ; వ్యయం: 05 ; గౌరవం: 02 ; అవమానం: 04. వృషభ రాశి => ఆదాయం: 05 ; వ్యయం: 14 ; గౌరవం: 05 ; అవమానం: 04. మిథున రాశి => ఆదాయం: 08 ; వ్యయం: 11 ; గౌరవం: 01 ; అవమానం: 07. కర్కాటక రాశి => ఆదాయం: 02 ; వ్యయం: 11 ; గౌరవం: 04 ; అవమానం: 07. సింహ రాశి => ఆదాయం: 05 ; వ్యయం: 05 ; గౌరవం: 07 ; అవమానం: 07. కన్యా రాశి => ఆదాయం: 08 ; వ్యయం: 11 ; గౌరవం: 03 ; అవమానం: 03. తులా రాశి => ఆదాయం: 05 ; వ్యయం: 14 ; గౌరవం: 06 ; అవమానం: 03. వృశ్చిక రాశి => ఆదాయం: 11 ; వ్యయం: 5 ; గౌరవం: 02 ; అవమానం: 06. ధనస్సు రాశి => ఆదాయం: 14 ; వ్యయం: 11 ; గౌరవం: 05 ; అవమానం: 06. మకర రాశి => ఆదాయం: 02 ; వ్యయం: 08 ; గౌరవం: 01 ; అవమానం: 02. కుంభ రాశి => ఆదాయం: 02 ; వ్యయం: 08 ; గౌరవం : 04 ; అవమానం: 02. మీన రాశి => ఆదాయం: 14 ; వ్యయం: 11 ; గౌరవం : 07 ; అవమానం: 02. ఈ రాశి వారికి గురుడు సంవత్సరమంతా ద్వాదశమంలో శని, రాహులు ఇద్దరు సంవత్సరమంతా కూడా చతుర్థంలో, కేతువు వృత్తిస్థానంలో సంవత్సరమంతా సంచరిస్తున్నారు గతసంవత్సరంతో పోల్చుకుంటే ఈ సారి మెరుగ్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చును. ఆదాయం: 02 వ్యయం: 11 గౌరవం: 04 అవమానం : 07 ఈ సంవత్సరం సంతోషించదగ్గ విషయమేమిటంటే కీలకమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకొనేటప్పుడు మితృల ద్వార లేదా ఇతరుల వలన సహాయం అందుతుంది దాని మూలాన పెద్దగా బారంగా అనుకోరు. మీ యొక్క ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు కలుగుతాయి కాబట్టి ఆదిశగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మేలుచేస్తుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని గతకొంత కాలం ఎదురుచూస్తున్న మీ ప్రథ్యర్తులను విజయవంతంగా ఎదుర్కొంటారు గెలుపు మీదే అవుతుంది. చేపట్టిన పనులను సమయానికి పూర్తిచేయుటలో కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొంటారు ఆటంకాలు కలుగుతాయి కాకపోతే చివరకు పూర్తి చేయగలుగుతారు అందుకు కాస్త ఓపిక అవసరం. చిన్న పరిశ్రమలవారికి ఇంట్లోనే ఉత్పాదన చేసే చేతివృత్తుల వారికి ప్రోత్సాహకరంగానే ఉంటుంది లాభాలను పొందుటకు అవకాశం కలదు కావున జాగ్రత్తగా ప్రణాలికలను సిద్దం చేసుకొని ఆదిశగా వెళ్ళండి విజయాలను పొందుతారు. ఉద్యోగులు, వ్యాపారస్థులు పెద్దగా ఆశలు పెంచుకోకండి ఉన్నకొంతలో సతృప్తి చెందుతూ నిదానంగా ఎదుగడానికి ప్రయత్నం చేయడం మూలాన మేలు జరుగుతుంది. కొత్తకొత్త వ్యాపారాలు అలాగే ప్రయత్నాలు అంతగా శ్రేయస్కరం కాదు అనుకూలించకపోవచ్చును ఉద్యోగులు మాత్రం మీ యొక్క అధికారులకు అనుగుణంగా నడుచుకోండి మీకు మిశ్రమ ఫలితాలు కలుగుటకు ఆస్కారం కలదు. విద్యార్థులు మాత్రం బుద్దిగా ఉండటం పెద్దల సలహాలను గురువులు చెప్పినట్లుగా నడుచుకొనుట మూలాన కొంత మేలు జరుగుతుంది ఫలితాలు మాత్రం సామాన్యంగా ఉంటాయి. ఖర్చులు పెరుగుటకు ఆస్కారం ఉంది అలాగే మతిమరుపు కొద్దిగా బాదిస్తుంది మీకు ఆరంభ శూరత్వం ఉంటుంది చదావాలనే ఆకాంక్షను కొనసాగించడం తప్పక మేలుచేస్తుంది. కళాకారులు అలాగే క్రీడాకారులకు మాత్రం గడ్డుకాలం అనిచెప్పుకొవచ్చును మీరు గుర్తింపును పొందడానికి అలాగే మీ యొక్క లక్ష్యాలను సాదించడానికి ఇంకా సమయం ఉంది అని గుర్తించుకోవాలి సంయమనం అవసరం పట్టుదలను వీడకండి నిదానంగా ఫలితాలుకలుగుతాయి. అన్నదాతలకు కాస్తా ఊరట చెందుతారు రైతులు ఉన్నంతలో పంటలు వేసుకోవడం పాడిని సరిగా చోసుకోవడం మూలాన ముందుకు వెళ్ళగలరు ఈ సంవత్సరం పర్వాలేదు మీకు. రాజకీయ నాయకులకు నిజంగానే పరీక్షాకాలం అన్నట్లుగా ఉంటుంది అకారణంగా సమస్యలను ఎదుర్కొంటారు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. గతంలో మీరు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేసిఉంటే దానికి తగిన మూల్యం చెల్లిస్తారు కావున ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముందుచూపును కలిగి ఉండుట మంచిది. మాసముల వారిగా: ఏప్రిల్: తలపెట్టిన పనులను కొంత నిదానంగానైనా పూర్తి చేయగలుగుతారు విద్యార్థులు కొంత పట్టుదలను చూపించాలి. క్రయవిక్రములలో బాగానే ఉంటుంది ఇతరులకు సహాయం చేయుట మూలాన సంతోషంగా ఉంటారు. మే: తలపెట్టిన పనులలో అనుకూలతలు పెరుగుతాయి ఆర్థికంగా బాగుటుంది అలాగే విద్యార్థులకు అనుకున్నవి జరుగుతాయి. శతృవర్గం నుండి సైతం ప్రశంశలు పొందుటకు అవకాశం కలదు. జూన్: చెడుపనులకు అవినీతి పనులకు దూరంగా ఉండటం మేలు అలాగే ఆర్థిక పరమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు నిదానంగా వ్యహరించండి. జూలై: అనవసరపు పనులను చేపట్టుట మూలాన కష్టాలు కలుగుతాయి పనికిరాని వారిని ఆసరాగా తీకొని పనులను చేపట్టుట మూలాన విఫలం చెందుతారు. అర్థికపరమైన విషయాల్లో సొంత నిర్ణయాల మూలాన ఇబ్బందులు తప్పకపోవచ్చును. ఆగష్టు: కుటుంభంలోని వ్యక్తుల సహాయ సహకారాలు మీకు సంతోషాన్ని ఇస్తాయి వృత్తి ఉద్యోగాలలో కష్టపడుట మూలాన పనులు ముందుకు సాగుతాయి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని సమర్థవంతమైన ఆలోచనలు చేస్తారు. సెప్టెంబర్: అధికంగా శ్రమను కలిగి ఉంటారు కుటుంభ సభ్యులకోసం ధనంను ఖర్చుపెడతారు. వాహనములు నడుపునప్పుడు తప్పక జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికంగా బాగనే ఉంటుంది. డబ్బులను ఇతరులకు ఇవ్వకండి. అక్టోబర్: ఉద్యోగంలో అధికారుల యొక్క ఒత్తిడి పెరుగుతుంది ఖర్చులు కూడా అకారణంగా కలుగుటకు అవకాశం కలదు. చిన్నపాటి శస్త్రచికిత్సలు జరుగుటకు అవకాశం కలదు. నవంబర్: ఉద్యోగంలో అదనపు భారం పెరుగుటకు ఆస్కారం కలదు జాగ్రత్త అలాగే సమయపాలన మేలుచేస్తుంది. బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు గట్టిగా ప్రయత్నం చేయుట మూలాన పనులు జరుగుతాయి. డిసెంబర్: వ్యాపారంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు మీరు అనుకున్న విధంగా వ్యహరిస్తారు పట్టుదలతో పనులు ముందుకు సాగుతాయి ఆర్థికంగా బాగానే ఉంటుంది. జనవరి : కుటుంభంలో బాగుంటుంది ఆనందంగా గడుపుతారు పెద్దల ఆశీర్వాదాలు తీసుకొనుట మంచిది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యములలో పాల్గొంటారు. ఫిబ్రవరి: వాహనములు నడుపునప్పుడు ఇతరులకు వాహనములు ఇచ్చునపుడు జాగ్రత్త అవసరం. ఆరోగ్యం విషయంలో లేదా ఇతర కారణముల చేత వైద్యశాలకు వెళ్ళవలసి రావోచ్చును. మార్చి: శతృవుల మూలాన తిప్పలు తప్పకపోవచ్చును. మీయొక్క కష్టాన్ని శ్రమను దోచుకుంటారు కొంత అసంతృప్తి ఉంటుంది. అకారణంగా వచ్చు కలహములకు దూరంగా ఉండటం మంచిది. పూజలు: ప్రతి శనివారం వేంకటేశ్వరస్వామి ఆలయం వెళ్ళండి తులసి మాలతో పూజించుట మేలు చేస్తుంది అలాగే వరుసగా 3 శుక్రవారాలు లక్ష్మీదేవికి అభిషేఖం చేయించండి 18 మంగళ వారాలు దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించుట 18 ప్రదక్షణలు చేయుట మేలు చేస్తుంది. ప్రతి రోజు దక్షిణామూర్తిని పూజించుట తప్పక అనుకూలిస్తుంది. 16 గురువారాలు గోమాతకు పచ్చగడ్డి తినిపించండి ఈ పని ఒక యజ్ఞం లాగ చేయండి. దానాలు లేదా జపాలు: రాహువుకు మినుములు దానం ఇవ్వడం జపాలు చేయించుట మేలు శనికి నల్లని నువ్వులు దానం ఇవ్వడం అలాగే జపం చేయించుట మంచిది. అదృష్ట సంఖ్యలు: 02, 11, 20, 29.

మరింత సమాచారం తెలుసుకోండి: