మేష రాశి     => ఆదాయం: 11;        వ్యయం: 05;        గౌరవం: 02;      అవమానం: 04. వృషభ రాశి   => ఆదాయం: 05;        వ్యయం: 14;       గౌరవం: 05;      అవమానం: 04. మిథున రాశి  => ఆదాయం: 08;        వ్యయం: 11;       గౌరవం: 01;      అవమానం: 07. కర్కాటక రాశి => ఆదాయం: 02;        వ్యయం: 11;       గౌరవం: 04;      అవమానం: 07. సింహ రాశి   => ఆదాయం: 05;         వ్యయం: 05;       గౌరవం: 07;      అవమానం: 07.   కన్యా రాశి    => ఆదాయం: 08;         వ్యయం: 11;       గౌరవం: 03;      అవమానం: 03. తులా రాశి   => ఆదాయం: 05;         వ్యయం: 14;       గౌరవం: 06;      అవమానం: 03. వృశ్చిక రాశి  => ఆదాయం: 11;         వ్యయం: 5;        గౌరవం: 02;      అవమానం: 06. ధనస్సు రాశి => ఆదాయం: 14;          వ్యయం: 11;      గౌరవం: 05;      అవమానం: 06. మకర రాశి   => ఆదాయం: 02;         వ్యయం: 08;       గౌరవం: 01;      అవమానం: 02. కుంభ రాశి   => ఆదాయం: 02;          వ్యయం: 08;      గౌరవం : 04;      అవమానం: 02. మీన రాశి   => ఆదాయం: 14;           వ్యయం: 11;      గౌరవం : 07;      అవమానం: 02.   
ఈ రాశివారికి గురుడు సంవత్సరమంతా దశమంలో. శని, రాహులు ఇద్దరు సంవత్సరమంతా కూడాద్వితీయంలో, కేతువు అష్టమ స్థానంలో సంవత్సరమంతా సంచరిస్తున్నారు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సారి మెరుగ్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చును. ఆదాయం: 08  వ్యయం: 11  గౌరవం: 03  అవమానం: 03 ఈ సంవత్సరం బాగుంటుంది ఆర్థికంగా బాగుటుంది ఆదాయానికి ఏ మాత్రం లోటు ఉండక పోవచ్చును ఏలినాటి శని ప్రభావం మీపై పెద్దగా కనిపించక పొవచ్చును నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి చేసే పనిలో శ్రద్ధను పెట్టండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల మక్కువను ప్రదర్శిస్తారు వాటిలో ఎక్కువగా పాల్గొనే అవకాశం కలదు. ఎవ్వరిని అంతగా నమ్మరాదు మీరు స్వియంగా పనిచేయుట వాటి గురుంచి తెలుసుకొనుట మేలు బద్దకాన్ని వీడండి నమ్మకం మంచిదే కానీ అతిగా నమ్మడం మూలాన నష్ట పోతారు ఈ ఒక్క విషయంలో తప్పక జాగ్రత్త పాటించాలి. చేపట్టిన పనులను, ప్రారంభించిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు కార్యక్రమంలో విజయాలను పొందుతారు. రైతులకు అనుకూలమైన సమయం పంట మంచిగా చేతికి వస్తుంది సంతోషాన్ని పొందుతారు పాడిని కూడా అభివృద్ధి చేసుకొనే పనిలో ఉండటం మంచిదే. ఉద్యోగులకు వ్యాపారస్థులకు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి కావున నిదానంగా ఆలోచించి పనిచేయుట నూతన వ్యాపారాలు అరంభించాలనుకుంటే వాయిదా వేసుకోవడం మంచిది కొంత కాలం ఆగడం ఆన్నివిధాల శ్రేయస్కరం. అలాగే మీయొక్క నోరును అదుపులో ఉంచుకొనుట మేలుచేస్తుంది ఎవ్వరితోనైన మాట్లాడేటప్పుడు కోపాన్ని విడనాడండి ఆచితూచి వ్యహరించుట మేలుచేస్తుంది. విధ్యార్థులు ప్రయోగాలు చేయకపోవడమే ఉత్తమం మిశ్రమ ఫలితాలు పొందుతారు కొద్దిగా శ్రమ, శ్రద్ద పెట్టి చదవండి బుద్దిబలాన్ని మీ యొక్క బలాన్ని నమ్ముకోండి విజయం మీ దరి చేరుతుంది ఇతరులతో పోల్చిచూసుకొనే అలవాటు మానండి మేలు జరుగుతుంది. పోటీ పరిక్షలకు ప్రీపేర్ అవుతున్న విద్యార్థులు మిమల్ని మీరు ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్ళండి అలాగే గట్టిగా ప్రయత్నం చేయడం మూలాన లక్ష్యం నెరవేరుటకు అవకాశాలు కలవు. స్త్రీలు మీరు తీసుకొనే నిర్ణయాలు కొత్త కొత్త సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది కావున ఒకటికి రెండుసార్లు ఆలోచించుట సూచన. ఉద్యోగులు మాత్రం ఉద్యోగ స్థానంలో కాస్తా అసంతృప్తిని పొందుతారు మీరు అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట మూలాన తప్పక మీరు అనుకున్నది జరుగుతుంది. ఇష్టం లేని ప్రాంతంలో నివసించవలసి రావోచ్చును. మాసముల వారిగా: ఏప్రిల్: ఆరోగ్యం విషయంలో అశ్రద్ద చేయకండి తగినా జాగ్రత్తలు పాటించుట మేలు చేస్తుంది. ఆదాయం బాగుటుంది అదే విధంగా ఖర్చులు కూడా కలుగుతాయి. ఉద్యోగులకు అధికారులతో మాటపడవలసి వస్తుంది. కుటుంభంలో నిదానంగా వ్యహరించండి. మే: దైవసంభంద పనులలో పాల్గొంటారు వ్యాపారంలో మెలుకువలు పాటించుట మూలాన కొంత అభివృద్ధి ఉంటుంది. కుటుంభంలో కొంత అనుకూలమైన మార్పులు కలుగుతాయి. జూన్: మంచి ఆలోచనలు చేయుట మూలాన మంచి జరుగుతుంది నిదానంగా వ్యహరించండి గతంలో చేసిన పనులను ఒక విధానంలోకి తీసుకువస్తారు. క్రయ విక్రయములు బాగా సాగుతాయి. జూలై: ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి వివాదములకు దూరంగా ఉండటం అలాగే చర్చల్లో తలదూర్చడం చేయకండి. చిన్న ప్రయత్నాలకు సైతం పట్టుదలను మానకండి. ఆగష్టు: విమర్శలు ఎదురైనా పనులలో విజయాన్ని పొందుతారు శుభకార్యములలొ పాల్గొంటారు. విదేశీయానములు ప్రయత్నించు వారికి అనుకూలంగా ఉంది. వివాహం కోసం ప్రయత్నం చేయు వారికి వివాహం అవుతుంది. సెప్టెంబర్: ప్రయత్నాలు కొద్దిగా ఇబ్బందులను కలిగిస్తాయి అధికశ్రమ అవసరం. ఉద్యోగులు తమ ఉద్యోగాలను తక్కువగా చూడడం మంచిదికాదు. కొంత మేర నిరాశాలను పొందుటకు అవకాశం కలదు. అక్టోబర్: వాహనములను నడుపునప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించుట మంచిది. అధికారులతో నూతన వ్యక్తులతోను ఆచితూచి వ్యహరించాలి. సహస పనులకు దూరంగా ఉండడం మేలు. నవంబర్: అనుకున్న పనులు కొంత ఆలస్యం అయినా పూర్తిఅవుతాయి ఖర్చులు కొద్దిగా పెరుగుటకు అవకాశం కలదు. ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి అలాగే సోదర వర్గమున ప్రమాదములు సంభవించుటకు అవకాశం కలదు సుబ్రమణ్య ఆరాధన మంచిది.   డిసెంబర్: అన్ని వ్యహారాలలో మీదైన విధానాలను కలిగిఉంటారు ఖర్చులను తగ్గించుటలో విజయాన్ని సాదిస్తారు. నూతన వ్యక్తుల పరిచయం కలుగుతుంది అలాగే నూతన పనులను చేపడుతారు. జనవరి: చేపట్టిన పనులలో శ్రద్ధను కలిగి ఉండడం సూచన అధికారులతో కలిసి మెలసి పనిచేయుట మేలు. ఫిబ్రవరి: మాట్లాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి బంధుమిత్రులను కలుస్తారు సమయాన్ని కేటాయించుట మేలు. గృహంలో మార్పులను చేపట్టుటకు ఆస్కారం కలదు. మార్చి: ఆర్థికంగా తగిన జాగ్రత్తలు తీసుకోండి నూతన ప్రయత్నాలు చేయునప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుట మేలు. కుటుంభంలో స్వల్ప విభేదాలు కలుగుటకు ఆస్కారం కలదు జాగ్రత్త. పూజలు: రుద్రకవచ పారయణ మేలు చేస్తుంది ప్రతినెల ఒక శనివారం శివునకు అభిషేఖం చేయించుట మంచిది ప్రతి బుధవారం వేంకటేశ్వరస్వామి దేవాలయం వెళ్ళడం మేలు చేస్తుంది. వరుసగా 7 మంగళవారాలు ఆంజనేయస్వామీ గుడికి గాని సుబ్రమణ్య దేవాలయం గాని వెళ్ళండి. దానాలు లేదా జపాలు: శనికి అలాగే కేతువుకు జపాలు చేయించుట మంచిది శనికి నల్ల నువ్వులు, కేతువుకు ఉలువలు దానం చేయుట మంచిది రాహువుకు మినుములు దానం ఇవ్వండి గోమాతకు శనివారాలు పచ్చగడ్డిని తినిపించండి. అదృష్ట సంఖ్యలు: 05, 14, 23 

మరింత సమాచారం తెలుసుకోండి: