మేష రాశి     => ఆదాయం: 11;        వ్యయం: 05;        గౌరవం: 02;      అవమానం: 04. వృషభ రాశి   => ఆదాయం: 05;        వ్యయం: 14;       గౌరవం: 05;      అవమానం: 04. మిథున రాశి  => ఆదాయం: 08;        వ్యయం: 11;       గౌరవం: 01;      అవమానం: 07. కర్కాటక రాశి => ఆదాయం: 02;        వ్యయం: 11;       గౌరవం: 04;      అవమానం: 07. సింహ రాశి   => ఆదాయం: 05;         వ్యయం: 05;       గౌరవం: 07;      అవమానం: 07.   కన్యా రాశి    => ఆదాయం: 08;         వ్యయం: 11;       గౌరవం: 03;      అవమానం: 03. తులా రాశి   => ఆదాయం: 05;         వ్యయం: 14;       గౌరవం: 06;      అవమానం: 03. వృశ్చిక రాశి  => ఆదాయం: 11;         వ్యయం: 5;        గౌరవం: 02;      అవమానం: 06. ధనస్సు రాశి => ఆదాయం: 14;          వ్యయం: 11;      గౌరవం: 05;      అవమానం: 06. మకర రాశి   => ఆదాయం: 02;         వ్యయం: 08;       గౌరవం: 01;      అవమానం: 02. కుంభ రాశి   => ఆదాయం: 02;          వ్యయం: 08;      గౌరవం : 04;      అవమానం: 02. మీన రాశి   => ఆదాయం: 14;           వ్యయం: 11;      గౌరవం : 07;      అవమానం: 02.   
 ఈ రాశి వారికి గురుడు సంవత్సరమంతా అష్టమంలో శని, రాహులు ఇద్దరు సంవత్సరమంతా కూడా ద్వాదశమంలో, కేతువు రుణస్థానంలో సంవత్సరమంతా సంచరిస్తున్నారు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సారి మెరుగ్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చును. ఆదాయం: 11 వ్యయం: 5 గౌరవం: 02 అవమానం: 06 ఈ సంవత్సరం మీరు చాలావరకు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అనిచెప్పుకొవచ్చును ఏలినాటి శని ప్రభావం మీ పై అధికంగా ఉండే అవకాశం ఉంది కావున జాగ్రత్తగా ఉండటం అనేది ముఖ్యం. ఆర్థికంగా బాగానే ఉంటుంది ఆదాయంతో పాటు ఖర్చులు అదే స్థాయిలో ఉంటాయి బాగాపెరుగుటకు అవకాశం కలదు అదుపులో ఉంచుకొనే ప్రయత్నం గట్టిగా చేయాలి. మాట పట్టింపుల మూలాన నష్టపోతారు కోపాల మూలాన ఇబ్బందులు కలుగుతాయి వీటిని అదుపులో ఉంచుకొనుట మేలు చేస్తుంది. మీరు పనిచేసే చోట పనిభారంను కలిగి ఉంటారు అలాగే ఇతరమైన విషయాల్లో కూడా పనిఒత్తిడి ఉంటుంది. చేపట్టే పనులలో ఆటంకాలు ఎదుర్కొంటారు వాటిని అధిగమించడానికి సమయస్ఫూర్తి అవసరం అలాగే నిరీక్షణ కూడా ముఖ్యం గుర్తుంచుకోండి. ఎలినాటి శని ప్రభావం మూలన అనారోగ్య సమస్యలు కలుగుటకు ఆస్కారం ఉంది అకారణంగా కలహములు కలుగుటకు అవకాశం కలదు కావున నిదానంగా వ్యహరించుట కొద్దిగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయడం మంచిది. కుటుంభ వాతావరణంలో కూడా కొంత మేర ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుటకు అవకాశం కలదు కాని వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు అధిగమిస్తారుకూడా.ప్రయాణాల్లో ఇబ్బందులు ఆటంకాలు ఎదురవుతాయి తగిన జాగ్రత్తలు పాటించుట మంచిది. బంధుమిత్రులను అతిగా నమ్మినచొ నమ్మక ద్రోహం ఉండుటకు అవకాశం ఉంది కొన్ని విషయాల్లో సొంత నిర్ణయాలే మేలు చేస్తాయి పనుల విషయంలో ఊరట లభిస్తుంది. కళాకారులకు అలాగే క్రీడాకారులకు కొద్దిగా బాగానే ఉంటుంది పెద్దగా ఇబ్బందులు కలుగవు అలాగని విజయాలు చెప్పుకోదగ్గవి ఉండకపోవచ్చును. రాజకీయ నాయకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అధికంగా శ్రమించాల్సి వస్తుంది గట్టిగా ప్రయత్నం చేస్తే ఫలితాలు మాములుగా ఉంటాయి. వ్యాపారస్థులు తప్పకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి నూతన పెట్టుబడులు కొత్త కొత్త వ్యాపరాలు అనుకూలించవు ఉన్నవాటినే సరిగా నడపడం మంచిది. ఉద్యోగులు మాత్రం ఉద్యోగాస్థానంలో ప్రయోగాలు చేయకండి నిదానంగా ఉండటం మీపనిని మీరు చేయడం ఇతరుల పనిలో వేలుపెట్టకపోవడం మరింత మంచిది మొత్తంమీద ఈసారి జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు బుడిగా చదువుకోవడం అర్థికవిషయాలకు దూరంగా ఉండటమనేది సూచన కొంత ఫలితాలు అనుకూలంగా ఉండకపోవుటకు అవకాశం కలదు. అధికార హోదాల్లో ఉన్నవారు తగుజాగ్రత్తలు పాటించుట మేలు. మాసముల వారిగా: ఏప్రిల్: సరదా కాలక్షేపములు చేయుటకు అవకాశం ఉంది మిత్రులతో నూతన ఆలోచనలు చేస్తారు స్నేహాలు పెరుగుటకు ఆస్కారం ఉంది. నూతన వస్తుప్రాప్తిని పొందుతారు ఖర్చులు పేరిగినప్పటికిని ఆద్యం బాగానే ఉంటుంది. మే: ఉద్యోగస్థానంలో కొంత పనిభారం ఉండుటకు అవకాశం కలదు అనారోగ్యం భాదించుటకు అవకాశం కలదు. దానం విషయంలో నిర్ణయాలు తీసుకొనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుటమేలు జూన్: కుటుంభ వ్యహరాలలో కొంత సంయమనం అవసరం నిదానంగా వ్యహరించుట మేలు చేస్తుంది. వాహనములకు దూరంగా ఉండటం అనేది సూచన. అకారణంగా మనోభీతిని పొందుతారు.     జూలై: శతృవులు పెరుగుతారు వారిమూలన ఇబ్బందులను ఎదుర్కొంటారు అకారణంగా మీ ప్రమేయం లేకుండానే మాటను పడవలసి వస్తుంది. వ్యాపారస్థులు నిదానంగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు చేయకండి. ఆగష్టు: రోజువారి పనులను మాత్రమే చేయండి నూతన పనులను వాయిదావేసుకోవడం మేలు చేస్తుంది. మాటపట్టింపులకు పోకండి ఆరోగ్యంకు ప్రాధాన్యతను ఇవ్వండి. క్రమశిక్షణను కలిగి ఉండుట తప్పక మేలుచేస్తుంది. సెప్టెంబర్: కుటుంభ సభ్యులనుంచి సహాయ సహకారాలు పొందుతారు అలాగే ఆర్థిక అవసరాలను ముందుగా గుర్తించి ఆదిశగా ప్రణాలికలను సిద్దంచేసుకోండి. విద్యార్థులు కొంత ఓపికతో పని చేయాలి శ్రమించాల్సి ఉంటుంది ఒకటికి రెండుసార్లు పనిచేయాల్సి వస్తుంది. అక్టోబర్: కోపాన్ని పొందుటకు అవకాశం ఉంది ఆదాయానికి మించిన ఖర్చులను పొందుతారు. బంధువర్గం నుండి అప్రియమైన వార్తను వినే అవకాశం కలదు. భూ క్రయ విక్రయాల్లో పాల్గొనే అవకాశం కలదు.  నవంబర్: దూరప్రాంత ప్రయాణాలు చేస్తారు చేపట్టిన పనుల్లో కొంతమేర పూర్తిచేయగలుగుతారు. అనేక ఆలోచనలు కలిగి ఉంటారు వాటిని అదుపులొ ఉంచుకొనుట మంచిది. పరీక్షలను ఎదుర్కొంటారు డిసెంబర్: నిరుద్యోగులకు అలాగే అవివాహితులకు దైవబలం కావాలి. విలువైన వస్తువులను వాడునప్పుడు నిదానంగా ఉండటం అలాగే తగిన జాగ్రత్తలు పాటించుట మూలన మేలు జరుగుతుంది. జనవరి: కుటుంభసహకారం చేత ఉద్యోగాస్థానంలో అధికారుల వలన కలిగే ఇబ్బందులను ఎదుర్కోగలుగుతారు. పెద్ద మనిషి తరహ విషయాలకు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం అనేది సూచన. ఫిబ్రవరి: చిన్న చిన్న పనులను పూర్తి చేస్తారు నూతన ప్రయత్నాలు నిదానంగా ముందుకు సాగుతాయి. సమయానికి భోజనం చేయడం మంచిది. బంధు మితృల్లో మీ లోగుట్టులను చెప్పకండి. మార్చ్: ఆర్థికంగా బాగా ఇబ్బందులను ఎదుర్కొంటారు మీ వాళ్ళు అనుకున్నవారు మోసం చేయుటకు అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు పాటించుట మేలుచేస్తుంది. అనారోగ్యం మూలాన ఇబ్బందులను పొందుతారు. పూజలు: విష్ణుసహస్రనామ పారాయణ చేయుట శివునకు అభిషేకాలు అలాగే గురువారాలు సాయిబాబా గుడికి వెళ్ళడం చేయండి దుర్గాదేవిని ప్రతిరోజు జపించుట మేలు చేస్తుంది శనివారాలు వరుసగా ఆంజనేయ దేవాలయం వెళ్ళడం చేయండి. దానాలు లేదా జపాలు: శనికి నువ్వులు దానం ఇచ్చుట జపాలు చేయించుట ఉత్తమం గురునకు శనగలు దానం ఇచ్చుట జపాలు చేయుంచుట మంచిది రాహువుకు మినుములు దానం ఇచ్చుట జపాలు చేయించుట మేలు నవగ్రహారధన మంచిది.  అదృష్ట సంఖ్యలు: 09, 18, 27 

మరింత సమాచారం తెలుసుకోండి: