వాహనదారులకు ప్రత్యేకంగా అటు లక్సరియస్ గా ఉంటూ సౌకర్యవంతంగా ఉండే మోడల్ కార్ స్కోడా.. మంచి లుకింగ్ తో తమ కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ తో ముందుకు దూసుకెళ్తున్న స్కోడా ఇప్పుడు మార్కెట్ లోకి తమ సరికొత్త మోడల్ సూపర్బ్ కార్ ను రిలీజ్ చేసింది. కొత్త స్కోడా సూపర్బ్ తో మీ ప్రయాణం మరింత హాయిగా సాగేందుకు సహకరిస్తుంది.   


క్లాస్ లీడింగ్ ఎక్విప్మెంట్ తో డ్రైవింగ్ కు బాగా వెసులుబాటు ఉండేలా ఈ మోడల్ మరింత సౌకర్యంగా తయారు చేయబడింది. పెట్రోల్, డిజీల్ కు వేరు వేరుగా ఇంజిన్ డిజైన్ చేయబడింది. సరికొత్త స్టైల్ తో ఈ స్కోడా సూపర్బ్ కొత్త జెనెరేషన్ మోడల్ గా ప్రయాణం సాగించడం జరుగుతుంది. ఈ థర్డ్ జెనరేషన్ స్కోడా సూపర్బ్ వోక్స్ వేగన్ యొక్క న్యూ మోడల్ ఎం.క్యూ.బి ఫ్లాట్ ఫాంలా కనిపిస్తుంది. 


ఇక మోడల్ గుర్తు పట్టాలంటే కొత్త ఆడి ఏ3 మోడల్ లా కనిపిస్తుంది. కాని వాహనం నడిపితే ఇది ఎంత ప్రత్యేకం అనేది తెలుస్తుంది. 80ఎం.ఎం వీల్ బేస్ సౌకర్యంతో కంఫర్టబుల్ సీటింగ్ తో ఈ మోడల్ రెడీ అయ్యింది. ఈ స్కోడా సూపర్బ్ ముందు వెనుక సైడ్స్ ఎటునుండి చూసిన అద్భుతమైన స్టైల్ లుకింగ్ తో దర్శనమిస్తుంది.


ఇక ఇది 650 లీటర్స్ సామర్ధ్యం గల వస్తువులను తీసుకు వెళ్లేందుకు సౌకర్యంగా ఉంటుంది. గ్యారేజ్ లెంథ్ కూడా చాలా ఎక్కువ భాగంతో డిజైన్ చేయబడింది. ఇక ఈ వాహనం ఫిబ్రవరి 23న రిలీజ్ అవుతుంది. అప్పటినుండి స్కోడా ఆథరైజ్డ్ డీలర్స్ దగ్గర అందుబాటులో ఉంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: