హోండా నావీ :


ఎక్కువగా కాలేజ్ స్టూడెంట్స్ వాడే బైకుల్లో ఇది ఒకటి.. గేర్ లెస్ గా ఉండే ఈ బైక్ స్కూటర్ లా కేవలం ఎక్స్ లేటర్ ద్వారా నడుస్తుంది. చూపులకు చాలా స్టైలిష్ గా ఉండే ఈ బైక్ తో షికార్లు చేస్తుంటారు స్టూడెంట్ గ్యాంగ్స్.. ప్రస్తుతం ఈ వెహికల్ సౌత్ లో రాలేదు. కేవలం నార్త్ సైడ్ స్టూడెంట్స్ దీన్ని ఎక్కువగా వాడతారు.


టివిఎస్ అపాచి ఆర్.టి.ఆర్ 200 ఏవి : 


మెరుపు వేగంతో దూసుకెళ్లీ ఈ బైక్ స్పోర్ట్స్ బైక్ లా ఉంటుంది. కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువగా ఈ బైక్ ను ఇష్టపడుతుంటారు. దీని ప్రైజ్ 88,900 రూపాయల నుండి 1 లాఖ్ 7 తౌసండ్ వరకు ఉంది. 200సిసి కెపాసిటీతో రోడ్డుమీద సర్రున వెళ్తుంది ఈ వెహికల్.


బజాజ్ ఎవెంజర్ స్ట్రీట్ 150 : 


కొంతమంది క్లాసిక్ పీపుల్ ఈ బైక్ ను ఇష్టపడతారు.. అభిరుచి గల వారికి ఈ బైక్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. 150 సిసి కెపాసిటీతో వచ్చే ఈ బైక్ 75,500 షోరూం ప్రైజ్ తో అందుబాటులో ఉంది.


సుజుకి జిక్సర్ :


ఇది కూడా రైడింగ్ అనుభూతి కోరుకునే స్టూడెంట్స్ ఇష్టపడతారు. 150 సిసి కెపాసిటీ గల ఈ బైక్ 77,650 ప్రైజ్ తో అందుబాటులో ఉంది. 


రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 :


కేవలం కొంతమంది స్టూడెంట్స్ మాత్రమే ఇలాంటి బైక్ వాడాలని అనుకుంటారు. బుల్లెట్ 350 తో పాటుగా అందుబాటులో ఉండే ఈ మోడల్ కూడా మోడ్రెన్ టెక్నాలజీతో చేయబడ్డది. దీని ప్రైజ్ 1.29 లాక్స్.


పియాజియో వెస్పా :  


స్టైల్ లో వెస్పా ను మించిన స్కూటర్ లేదు. పియాజియో కంపెనీ నుండి వచ్చిన ఈ వెస్పా స్కూటర్ విభాగంలో సరికొత్త ప్రమాణాలను తీసుకువచ్చింది. క్లాసిక్ స్కూటర్ అనుంభూతి కోరుకునే వారికి ఈ వెస్పా చక్కగా ఉంటుంది. 125సిసి కెపాసిటీ గల వెస్పా 77,308 ఒక మోడల్ ఇంకా 88,696 వెస్పా ఎస్.ఎక్స్.ఎల్ 150 అందుబాటులో ఉంది.


కె.టి.ఎం డ్యూక్ 200 :


బైక్ విభాగంలో అధిక ప్రైజ్ గల డ్యూక్ దాదాపు 1.43 లాక్స్ కు అందుబాటులో ఉంటుంది. దీనిపై స్టూడెంట్స్ మంచి స్టైలిష్ డ్రైవింగ్ అనుభూతిని పొందుతారు. అంతేకాదు డ్యూక్ రోడ్ పై వెళ్తుంటే మిగతా వారి కళ్లన్ని ఆ బైక్ మీదే ఉంటాయి.  


యమహా ఫాస్కినో :


113 సిసి కెపాసిటీ కల ఈ స్కూటర్ గాళ్ స్టూడెంట్స్ వాడుతారు. స్మూత్ డిజైన్ తో రోడ్ మీద ఎంతో సౌకర్యంగా నడిచే ఈ బైక్ 53,100 రూపాయలతో అందుబాటులో ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: