ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలు గల వాహనాలను అందిస్తున్న బి.ఎం.డబల్యు సంస్థ మరో సరికొత్త విధానానికి ప్రస్థానం మొదలు పెట్టింది. వాహన రంగంలో తమకు సాటిలేని శక్తిగా ఎదుగుతున్న బి.ఎం.డబల్యు కస్టమర్స్ సాటిస్ ఫ్యాక్షన్ కోసం సరికొత్త విధి విధానాలను ఎప్పటికప్పుడు ప్రవేశ పెడుతూనే ఉంది. ఇక ప్రస్తుతం బి.ఎం.డబల్యు సరికొత్తగా 3, 4 సిలిండర్స్ కలిగిన ఇంజిన్లను రిలీజ్ చేయబోతుంది.  


ఇప్పటిదాకా ఉన్న వెహికల్స్ కన్నా మరింత పవర్ ఫుల్ గా ఉండేందుకు ఈ ఇంజిన్లు సహకరిస్తాయని అంటున్నారు. రాబోయే ఫ్యూచర్ మోడలస్ కు ఈ 3, 4 సిలిండర్ విధానాన్ని ప్రవేశ పెడుతున్నారు. పెట్రోల్, డిజిల్ రెండు రకాల వాహనాలకు ఈ ఇంజిన్లు ఏర్పాట్లు చేస్తున్నారు. 4 సిలిందర్ ఇంజిన్ ట్విన్ స్క్రోల్ టర్బో చార్జర్స్ తో అందుబాటులో ఉంటుంది.


2017 లో వచ్చే అన్ని వెహికల్స్ లో ఈ 3, 4 సిలిండర్ ఇంజిన్లు అందుబాటులో తెచ్చేలా చూస్తున్నారు. అత్యత మెరుగైన సౌర్యవంతమైన సేవలతో బి.ఎం.డబల్యు ఇప్పటికే భారతీయ వాహన మార్కెట్ పై తన ఆధిపత్యం సాధిస్తుంది. మరి రానున్న ఈ కొత్త మోడల్ ఇంజిన్స్ తో ఇంకెంత సేల్ రిపోర్ట్ పెరుగుతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: