భారతదేశ టూ వీలర్ మార్కెట్ రంగంలో మరింత ముందడుగేస్తుంది. కస్టమర్స్ ప్రాధాన్యతే ముఖ్యంగా అన్ని కంపెనీలు తమ తమ ఉత్పత్తులను తయారు చేస్తుండగా వాహనదారులు కూడా వారిని కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక గణనీయంగా టూ వీలర్స్ సేల్ జూలై నెలలో పెరగడం విశేషం. మంత్లీ టార్గెట్స్ కన్నా జూలై మంచి సేల్ రేట్ రిపోర్ట్ తో ఉంది.


ముఖ్యంగా ఈ నెలలో ముందు వరుసలో ఉన్న బైక్ యమహా. జపనీస్ మ్యానుఫ్యాక్చర్ తో వస్తున్న ఈ బైకులకు యూత్ బాగా ఎట్రాక్ట్ అవుతున్నారు. ఏకంగా ఈ సంవత్సరం ఇప్పటికే 12 శాతం వృద్ధి రేటు సాధించింది. 2015లో జూలై నెల కల్లా 58,477 బైకులను అమ్మిన యమహా ఇప్పుడు ఈ సంవత్సరం జూలై లో 65,244 యూనిట్స్ ను అమ్మేయడం జరిగింది. మేజర్ గా సిటీస్ లో ఈ వాహన కొనుగోలు దారులు ఉండటం విశేషం. 


ఇక ఈ సంవత్సరం హోండా బైకులు సేల్ రిపోర్ట్ కూడా అత్యద్భుతంగా ఉంది. లాస్ట్ మంత్ తో నాలుగున్నర లక్షల యూనిట్స్ మైల్ స్టోన్ ను క్రాస్ చేసిన హోండా లాస్ట్ ఇయర్ ఇదే నెలకు వచ్చేసరికి 3,89,555 యూనిట్స్ సేల్స్ లో ఉంది. అంటే లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఇప్పుడు 33 శాతం అధిక సేల్ రిపోర్ట్ కలిగి ఉంది.


ఇక స్పోర్ట్ బైకుగా యూత్ ను బాగా ఎట్రాక్ట్ చేస్తున్న యు.ఎం బైక్ లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం ఎక్కువ సేల్ కలిగిఉంది. దాదాపు 44 శాతం సేల్ అధికంగా ఉంది. ఇక ఇదే ఊపుతో మరో 35 దేశాల్లో యు.ఎం బైకులు అందుబాటులోకి రానున్నాయి.


ఇక బజాజ్ బైకుల విషయానికొస్తే లాస్ట్ ఇయర్ 21 పర్సెంట్ లాభాల్లో ఉన్న ఈ కంపెనీ ప్రస్తుతానికి లాస్ లాభాలను ఈక్వల్ గా ఉన్నాయి. ఇప్పటి వరకు జీరో లాస్ జీరో ప్రాఫిట్ తో ఈ సంవత్సరం సేల్ తో కలిగి ఉంది బజాజ్.    


ఇక హీరో మోటో కార్ప్ నుండి వస్తున్న బైకుల సందడి కూడా బాగానే ఉంది. లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈ సంవత్సరం 9 - 10 మధ్య వృద్ధి రేటుతో ఆమోదయోగ్యంగా ఉంది హీరో కంపెనీ. ఇక నుండి వచ్చే సేల్ రిపోర్ట్ ను బట్టి వీటి ప్రాఫిట్ లాస్ తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: