మార్కెట్ లో ఎన్ని మోటర్ బైకులు ఉన్నా ఎవరి మార్కెట్ వారిదిగా ఉంటుంది.. అయితే హోండా కున్న మైలెజ్ కం పికప్ ఫీచర్స్ తో వాహదారులు దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ప్రయాణం వేగవంతం మరియు సుఖమయంగా సాగాలని కోరుకునే వారికి హోండా బైకులు మంచి సౌకర్యవంతం. ఇక హోండాలో వచ్చి సిఎక్స్ మోడల్ 2014 లో సంచలనం సృష్టించింది.


భారతదేశపు ఆ అండ్ డి ద్వారా తయారు చేయబడిన మొట్టమొదటి వాహనంగా హోండా సిఎక్స్-1 మోడల్ ప్రసిద్ధి గాంచింది. దీని స్టైలిష్ లుకింగ్ అందరిని అవాక్కయ్యేలా చేస్తుంది. దీని ఆధారంగానే హోండా సిబి హార్నెట్ బైక్ రిలీజ్ చేసింది. ఇక ఇదే విధానంలో ఇప్పుడు సరికొత్త సిఎక్స్-2 బైక్ ను రూపొదించడం జరిగింది. ఇది కూడా భారతదేశపు హోండా ఆర్ అండ్ డి రెండవ కాన్సెప్ట్ తో డిజైన్ చేయబడ్డది. 


ఎటువంటి కండీషన్స్ లో నైనా రైడింగ్ హ్యాపీగా ఉండే విధంగా ఈ బైక్ డిజైన్ చేయబడింది. ముఖ్యంగా రవాణాకు సరిగా లేని రోడ్ల మీద కూడా హోండా సిఎక్స్-2 సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది ఓ అడ్వెంచరస్ మోడల్ బైక్ గా మార్కెట్ లోకి రాబోతుంది. ముందు భాగం హెవీగా ఉంటూ హెడ్ ల్యాంప్ ఇనుమడింపబడింది. ఇక దీని ఇండికేటర్స్ కూడా ఎల్.ఈ.డితో ఉంచబడింది. ఇక ఎల్ షేప్ ఎల్.ఈ.డి టైలైట్ కూడా దాదాపు హోండా యూనికాన్ కు ఉన్నట్టుగా ఉంటుంది. 500సిసి బైక్ గా మార్కెట్ లోకి వస్తున్న ఇది బైక్ రేసుల్లో వాడటం జరుగుతుంది.       


మరింత సమాచారం తెలుసుకోండి: