లక్సరియస్ కార్లలో తన ఉణికిని చాటుతున్న స్కోడా కంపెనీ 2017 ఆక్టెవియా ఫేస్ లిఫ్ట్ మోడల్ ను లాంచ్ చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. జూలై 13న ఇండియన్ మార్కెట్ లోకి స్కోడా ఆక్టేవియా ఫేస్ లిఫ్ట్త్ వెహికల్ లాంచ్ అవుతుంది. ప్రస్తుతం మార్కెట్ లో నడుస్తున్న స్కోడా అక్టేవియా మోడల్ తో అదనంగా ఫేస్ లిఫ్ట్ సౌకర్యంతో ఈ వెహికల్ డిజైన్ చేయబడింది.


ఇక ఈ వెహికల్ అడ్వాన్స్ గా కావాలనుకునే వారు ముందుగా 51వేల రూపాయలతో ముందుగా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. టోటల్ ఎల్.ఈ.డి హెడ్ ల్యాంప్ తో పాటుగా అండర్ లైన్ డీఅరెల్ సౌకర్యంతో ఈ వెహికల్ రాబోతుంది. ఇక ఈ వెహికల్ 1.8 లీటర్ టి.ఎస్.ఐ పెట్రోల్ ఇంజిన్, 1.4 లీటర్ డీజిల్ ఇంజిన్ తో అందుబాటులో ఉంటుంది. 6 స్పీడ్ ఆటో ట్రాన్స్ మిషన్స్ తో వస్తున్న ఈ వెహికల్ జిఎస్టి ఎఫెక్ట్ తో కొత్త ప్రైజ్ రేట్ ఇంకా నిర్ణయించలేదు.   



మరింత సమాచారం తెలుసుకోండి: