బజాజ్ బైక్ లు అన్ని మంచి మైలేజ్ బైకులుగా పేరు తెచ్చుకున్నవే. అయితే ఇప్పుడు బజాజ్ నుండి సరికొత్తగా ఎలెక్ట్రిక్ స్టార్ట్ బైక్ రాబోతుంది. అది కూడా ఎంతో ప్రఖ్యాత చెందిన సిటీ 100 4వ వేరియేషన్ లో ఈ ఎలెక్ట్రిక్ స్టార్ట్ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది. రానున్న రోజుల్లో టూ వీలర్స్ అన్ని ఎలెక్ట్రిక్ స్టార్ట్ కలిగి ఉంటాయని తెలిసిందే ఆ ఆలోచనతో బజాజ్ కూడా బేసిక్ మోడల్ ఎలెక్ట్రిక్ స్టార్ట్ రెడీ చేసింది.


సిటీ 100 ఇదవరకు మంచి మైలేజ్ బైక్ గా ఉండేది. ఇక ఇప్పుడు దానికి కొత్త ఎలెక్ట్రిక్ స్టార్ట్ గా తీర్చిదిద్దుతున్నారు. ఈ బైక్ విలువ 41 వేలకు అటు ఇటుగా ఉంటుందట. సాధారణ బైక్ కన్నా ఈ బైక్ 7000 వరకు అధనంగా ఉంటుందని తెలుస్తుంది. మరి బజాజ్ నుండి వస్తున్న ఈ సరికొత్త ఎలెక్ట్రిక్ స్టార్ట్ సిటీ 100 ఎలాంటి సేల్స్ కలిగి ఉంటుందో చూడాలి.   



మరింత సమాచారం తెలుసుకోండి: