హీరో కంపెనీ తమ బైకుల మీద కొద్దిగా రేటు పెంచబోతున్నట్టు తెలుస్తుంది. ప్రతి బైక్ ను మోడల్ ను బట్టి 400 నుండి రేటు పెంచబోతున్నట్టు తెలుస్తుంది. ముడి సరుకుల ధరలు పెరగడంతో రేటు పెంచడం అనివార్యమని అంటున్నారు. కస్టమర్స్ ఎట్రాక్టివ్ మోడల్స్ తో ఆకట్టుకుంటున్న హీరో మార్కెట్ లో ఉన్న మైలేజ్ బైకులన్నిటికి మంచి పోటీ ఇస్తుంది.


ఇక ధర సంగతి కాస్త అటు ఇటుగా ఉన్నా సరే హీరో బ్రాండ్ వాల్యూకి తగినట్టుగా మంచి మైలేజ్ బైకులను అందిస్తుంది హీరో మోటో కార్ప్. మార్కెట్ లో ఉన్న హోండా, బజాజ్ లాంటి మైలేజ్ బైకులకు హీరో గట్టి పోటీ ఇస్తుంది. మరి ధరలు పెరిగిన హీరో బైక్ సేల్స్ ఎలా ఉంటాయో చూడాలి. ప్రస్తుతం హీరో మోటో కార్ప్ నుండి వచ్చిన గ్లామర్ ఎక్కువ సేల్స్ కలిగి ఉంటుంది.   


మరింత సమాచారం తెలుసుకోండి: