ఇయర్ ఎండింగ్ సేల్స్ లో హీరో మోటార్స్ దుమ్మురేపేలా సేల్స్ సాధించింది. ముఖ్యంగా టూ వీలర్ లో మైలేజ్ ఇచ్చే హీరో బైక్ ఒక్క నెలలోనే 43 శాతం వృద్ధి రేటు సాధించడం విశేషం. ఇదో రకంగా హీరోకి బాగా కలిసి వచ్చే అంశమే అని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ డిసెంబర్ తో పోల్చితే వృద్ధిరెటు పెరిగింది. డీటైల్డ్ గా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో 3,30,202 వాహనాలను అమ్మగా.. ఈ ఇయర్ 4,72,731 యూనిట్లను అమ్మడం జరిగింది.


ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు 11 శాతం వృద్ధి రేటు సంపాదించగా.. డిసెంబర్ నెలలో ఆఫర్ల ప్రకటన ద్వారా ఎక్కువ మొత్తం యూనిట్లను అమ్ముడయ్యేలా చేశారు. హీరో అమ్మకాల్లో లాస్ట్ ఇయర్ ప్రోత్సాహకరంగా ఉన్నాయని చెప్పొచ్చు. కేవలం స్వదేశంలోనే కాదు విదేశీ మార్కెట్ లో కూడా హీరో బెంచ్ మార్క్ అందుకోవడం జరిగిందట. మొత్తానికి హీరో మోటో కార్ప్ 2017 బాగా కలిసి వచ్చిందని చెప్పాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: